స్టార్ బ్యూటీ అనసూయకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. యాంకర్ గా, నటిగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలను యాక్టివ్గా ఉంటూ గ్లామర్ ట్రీట్ తో కుర్రకారును కవ్విస్తుంది. హాట్ ఫోటోషూట్‌తో చెమటలు పట్టిస్తుంది. అంతేకాదు.. ఏది మాట్లాడాలన్నా స్ట్రైట్ ఫార్వర్డ్‌గా చెప్పే ఈమె.. ఇంటర్వ్యూలలోను ఎన్నోసార్లు ఓపెన్ కామెంట్స్ చేసి.. నెటింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే.. తాజాగా తన భర్తకు సంబంధించిన కొన్ని విషయాలను షేర్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. మా ఆయన పర్ఫెక్ట్ అని అందరూ భావిస్తారు. కానీ.. ఆయన కూడా అందరి మగాళ్ళలాన్నే. మా ఇద్దరి మధ్య కూడా చాలా సందర్భాల్లో గొడవలు అయ్యాయి.
నేను వెళ్లి కొంతమందిని కలవడం.. కొంతమందితో సినిమాలు చేయడం.. ఆయనకు అసలు ఇష్టం ఉండదు. ఆ టైంలో చాలా ఇబ్బందులు, గొడవలు కూడా జరిగాయి. నేను హీరోలతో, పెద్ద పెద్ద స్టార్లతో, గుడ్ లుకింగ్ పీపుల్‌తో ఇంట్రాక్ట్ అయినప్పుడు ఆయన చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు. అబ్బాయిలు మనస్తత్వమే అలా ఉంటుంది. నన్ను ఫ్లడ్ చేయడం కావచ్చు.. కాంప్లిమెంట్ కావచ్చు.. ఆయన మాత్రం అస్సలు దానిని తీసుకోలేరు అంటూ చెప్పుకొచ్చింది. సాధారణంగా.. అందరూ అనసూయ భర్త తనను అన్నీ చేయిస్తాడు.. అన్నిటికి ఫ్రీడమ్ ఇస్తాడు అని అనుకుంటారు. వాడు చేతకాని వాడని కూడా అంటారు. కా..నీ అదృష్టం ఏంటంటే మా ఆయనకి తెలుగు రాకపోవడం. అంతేకాదు.. సోషల్ మీడియాలో కామెంట్స్‌ను తాను పెద్దగా పట్టించుకోడు. ఆయనలా ఉండాలని నేను చాలా సార్లు అనుకుంటా.. ఇక తనతో ఉన్నట్లు వేరే వాళ్ళతో నేను ఎప్పుడూ ఉండలేను.
నాకు ఎదుట వ్యక్తి బ్యాడ్ గా అనిపించినప్పుడు.. నేను కూడా అతనికి బ్యాడ్ గానే కనిపిస్తా.. అది హ్యూమన్ బిహేవియర్ అంటూ చెప్పుకోవచ్చింది. నేను మా ఆయనతో ఇన్ సెక్యూర్ గా ఫీల్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇక అనసూయకు అసూయ అనేది తన భర్త దగ్గర మాత్రమే ఉంటుంది.. ఇంకెక్కడ ఉండనే ఉండదు. నేను మోస్ట్ సెక్యూర్డ్ పర్సన్ ని. ఆయన కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటారు అంటూ చెప్పుకొచ్చాంది. ఇక అన్న, అమ్మ, అక్క, తొడబుట్టిన వాళ్లతో ఎక్కడ విడాకులు ఉండవు. కేవలం భార్యాభర్తలొకే విడాకులు జరుగుతుంటాయి. పెళ్లికి మన భారతీయ సంప్రదాయం ఇచ్చేంత గౌరవం మరి ఎక్కడ దొరకదు. అయితే ఈ మధ్య విడాకుల వల్ల దాని విలువ కూడా తగ్గిపోతుంది.. ఓపిక, అడ్జస్ట్మెంట్ వల్ల బంధాలు మరింత స్ట్రాంగ్ అవు తాయి. ఈ జనరేషన్ కు అంత ఓపిక లేదంటూ అనసూయ వివరించింది. ప్రస్తుత అనసూయ కామెంట్స్ నెటింట వైరల్ గా మారుతున్నాయి.