టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. పవన్ ఏపి డిప్యూటీ సీఎంగా మారిన తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే సినిమాకు భారీగా ప్రీమియర్ షోస్ పడ్డాయి. టికెట్ ధరలు భారీగా పెంచి చాలా వరకు కలెక్షన్లు దక్కించుకున్నారు మేకర్స్. అయితే.. ఈ సినిమా సెకండ్ హాఫ్‌లో పవన్ కళ్యాణ్‌ను చూపించిన విధానం విఎఫ్‌ఎక్స్ స్టోరీ లాగా అనిపించడంతో నెగటివ్ టాక్ వచ్చింది.
ఈ క్రమంలోనే అభిమానులతో పాటు.. సాధారణ ఆడియన్స్ సైతం టికెట్లకు ఈ రేంజ్‌లో ఖర్చు పెట్టడం కష్టమని టికెట్ రేట్లు తగ్గించాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే మూవీ యూనిట్.. సినిమా టికెట్ల రేటు భారీగా తగ్గించినట్లు వైరల్ గా మారుతుంది. నేటి నుంచి సినిమా టికెట్ కాస్ట్ భారీగా తగ్గనుందట. జులై 24న వచ్చిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.91 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టినట్లు సమాచారం. బుక్‌మైషో ఇతరత్రా యాప్‌లలోను టికెట్ ధరల్లో చేంజ్ కనిపిస్తుందట. సింగిల్ స్క్రీన్‌లలో బాల్కనీకి 175 మల్టీప్లెక్స్‌లలో రూ.295కు టికెట్ ధరలు దిగివచ్చినట్లు తెలుస్తుంది.
దీంతో.. సినిమా కలెక్షన్ల పై ప్రభావం ఉంటుందని కచ్చితంగా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టికెట్ ధరలు అధికంగా ఉండడం వల్ల ఫ్యామిలీలతో సినిమా చూడాలనుకునే ఆడియన్స్ వెనకడుగు వేసే అవకాశం ఉంది. అలాంటిది టికెట్ రేట్లు తగ్గడం ఫాన్స్‌కు ఒక గుడ్ న్యూస్ అనడంలో సందేహం లేదు. ఇక సినిమాలో కొన్ని బోరింగ్ సన్నివేశాలను విఎఫ్‌ఎక్స్ బాగోని.. ట్రోల్స్ ఎదురైనా సన్నివేశాలు సైతం ట్రిమ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టికెట్ రేట్లు తగ్గడంతో కలెక్షన్‌లపై ప్రభావం ఉంటుందేమో చూడాలి.