ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీని వరుస విషాదాలుచుట్టుముడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం కోట శ్రీనివాస, తర్వాత బి.సరోజినీ దేవి లాంటి వారు మరణించిన సంగతి తెలిసిందే. ఇంతలోనే మరో విషాదం టాలీవుడ్ లో నెలకొంది. కమెడియన్ గా చాలా కాలం టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని ఇమేజ్‌తో రాణించిన ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలోనే ఆరోగ్యం అంతకంతకు క్షీణిస్తూ శుక్రవారం రాత్రి ఆయన తన తుది శ్వాస విడిచాడు. ఫిష్ వెంకట్ మరణ వార్త చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొల్పింది.ఈ క్రమంలోనే ఆయన సినిమాలను కెరీర్ విశేషాలను గుర్తు చేసుకుంటూ అభిమానులు తెగ బాధ పడిపోతున్నారు. ఇక ఎన్నో సందర్భాల్లో డైరెక్టర్ వి.వి.వినాయక గాడ్ ఫాదర్ అని ఫిష్ వెంకట్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఆయన తెరకెక్కించిన ఆది సినిమాతో ఫిష్ వెంకట్‌కు మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాల్లో ఫిష్ వెంకట్ చెప్పిన.. చిన్న తొడ కొట్టు చిన్న అనే డైలాగ్ ఏ రేంజ్ లో పాపులర్ అయిందో తెలిసిందే. తర్వాత దిల్, బన్నీ, చెన్నకేశవ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో వి.వి.వినాయక్ తెలిసి మరి ఫిష్ వెంకట్‌కు అవకాశం ఇచ్చారు. ఇక ఆయన తర్వాత అంతటి ప్రాధాన్యత ఇచ్చింది డైరెక్టర్ హరీష్ శంకర్ అంటూ ఫిష్ వెంకట్ పలు సందర్భాల్లో వివరించాడు. ఇక ఈ క్రమంలోనే గతంలో ఫిష్ వెంకట్ చేసిన కొన్ని గమనించినట్లు వైరల్ గా మారుతున్నాయి. గతంలో నేను అల్లు అర్జున్, బాలయ్య డైరెక్టర్ వి.వి.వినాయక్‌కు సైతం గంటసేపు తన కోసం వెయిట్ చేయించాను అని చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్.. బన్నీ మూవీ షూట్ కోటిలో జరుగుతోందని.. నేను ఉదయాన్నే లేచి షూటింగ్ కి వెళ్ళాలి.. కానీ రాత్రి ఫంక్షన్ లో డ్రింక్ ఓవర్ కావడంతో నిద్ర లేపడానికి ఇంట్లో కూడా ఎవరూ లేకపోవడంతో.. పది గంటలకు లేచానని అక్కడ షూటింగ్ లొకేషన్లో అల్లు అర్జున్ వినాయక్ గారు.. ఆర్టిస్టులు, కో డైరెక్టర్స్ నాకోసం ఎదురు చూస్తున్నారు.. నేను లేటుగా వెళ్లేసరికి అందరూ నన్ను తిట్టిపోతారంటూ చెప్పుకొచ్చాడు.
వినాయక్ గారు పోరా అని ఒకే ఒక్క మాట అన్నాడని.. సేమ్ సీన్ బాలయ్య చెన్నకేశవరెడ్డి షూట్ సమయంలో కూడా రిపీట్ అయిందని.. బాలయ్య కూడా నా కోసం వెయిట్ చేశారంటూ చెప్పుకొచ్చాడు. లైట్ డ్రింకింగ్ ఓవర్ కావడంతో మార్నింగ్ లేటుగా లేచా. ఉస్మాన్ సాగర్ గెస్ట్ హౌస్ వద్ద చెన్నకేశవరెడ్డి షూట్ జరుగుతున్న క్రమంలో బాలయ్యతో పాటు.. వినాయక్ గారు కూడా వెయిట్ చేస్తున్నారు. నా వల్ల బాలయ్య ఎదురుచూడాల్సి రావడంతో.. అంతా నాపై కోపంతో ఊగిపోయారు. నేను వెళ్ళా కో డైరెక్టర్లు ఇష్టం వచ్చినట్లు తిట్టేశారు.. నిర్మాత బెల్లంకొండ సురేష్ సైతం నాపై ఆగ్రహం వ్యక్తం చేశారని ఫిష్ వెంకట్ వివరించాడు. ఈ రెండు సంఘటనలు తప్ప తాను ఎప్పుడూ షూటింగ్స్ కు లేటుగా వెళ్లలేదని చెప్పుకొచ్చాడు. ఇక మత్స్యకార కుటుంబానికి చెందిన ఫిష్ వెంకట్ స్వస్థలం మచిలీపట్నం. దివంగత నటుడు శ్రీహరి సపోర్ట్ తోనే ఫిష్ వెంకట్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినట్లు తానే వివరించాడు.