కోట్లు సంపాదించినా.. కోటా జీవితం ముళ్ళ పాన్పే.. ఒంటరిగా ఎన్నో కన్నీళ్లు..!

టాలీవుడ్ విలక్షణ నటుడు కోటా శ్రీనివాస్‌ మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర కుదిపేసింది. ఎంతో మంది స్టార్ సెలబ్రేట్లతో పాటు.. చాలామంది రాజకీయ నాయకులు సైతం ఆయన మరణంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన.. 700 లకు పైగా సినిమాల్లో నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. కంటిచూపుతో భయపెట్టాల‌న్నా, వెటకారంతో వెక్కిరించాల‌న్న‌, అంతేకాదు తెలంగాణ యాసలో కామెడీ డైలాగులతో ఆడియన్స్ను కడుపుబ్బ నవ్వించాల‌న్న అయ‌న‌కు ఆయ‌నే సాటి. ఎలాంటి పాత్రకైనా 100% ఎఫర్ట్స్‌ ఇస్తూ.. తన సత్తా చాటుకున్న కోట.. రోజుకు 20 గంటలు పని చేసేవారు. ఈ క్రమంలోనే ఊహించిన దానికంటే 1000 రెట్లు ఎక్కువగా అభిమానాన్నే కాదు.. కోట్లాది ఆస్తులు కూడా పెట్టుకున్నారు.

ఎంత కోట్లు ఉన్నా ఆయన జీవితం ముళ్ళ పాన్పు గానే సాగింది. ఆయన జీవితంలో ఎన్నో కన్నీళ్ళు, గుండెల్లో దుఃఖన్ని ఒంటరిగా మోస్తూ వెండితెరపై నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన క్ష‌ణాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు. గతంలో ఓ ఇంటర్వ్యూలో తానే స్వయంగా తన జీవితంలోని కష్టాలను వర్ణించాడు. 1968 లో నాకు రుక్మిణితో వివాహం అయింది. 1973లో నా భార్య డెలివరీ అయినప్పుడు జరిగిన విషాదంలో నా తల్లిని కోల్పోయా. అప్పుడు నా భార్యకు తగిలిన షాక్ నేను గమనించలేదు. తర్వాత తను ఒక సైకియాట్రిక్ పేషెంట్‌గా మారిపోయింది. 30 ఏళ్ల పాటు నన్ను కూడా గుర్తుపట్టలేదు. తను తిట్టిన ఓర్పుగా భరించా. కారణం ఆమె నా భార్య. నాకు క్లోజ్ గా ఉండే వాళ్లకు మాత్రమే ఈ విషయం తెలుసు.

actor kota srinivasa rao who actress in kannada movies this health problem makes headlines | ಹೇಗಿದ್ದ ಹಿರಿಯ ನಟ ಹೇಗಾಗಿದೆ ನೋಡಿ..!! ಅಪ್ಪು to ಕಿಚ್ಚನ ಜೊತೆ ನಟನೆ.. ಕನ್ನಡಿಗರ ಪ್ರೀತಿ ಗಳಿಸಿದ್ದ ...

ఇప్పటివరకు ఎవ‌రికి చెప్పలేదు అంటూ ఎమోషనల్ అయ్యారు. నా రెండో కూతురు ఎంకం చదువును పూర్తి చేసింది. ఎప్పుడు రిక్షా ఎక్కలేదు అనే విజయవాడలో బంధువులతో కలిసి రిక్షా ఎక్కగా.. ఎదురుగా బ్రేకులు ఫెయిల్ అయిన లారీ ఆ రిక్షాను ఢీకొంది. ప్రమాదంలో కొందరు చనిపోతే నా కూతురు ప్రాణాలతో బయటపడింది. ఆమె ఈ సంఘటనలో త‌న కాలు కోల్పోయింది. ఎంతో కృంగిపోయింది. కట్ చేస్తే బ్యాంకులో నేనెవరి దగ్గర అయితే గుమాస్తగా చేశాను ఆయన నాకు వియ్యంకుడ‌య్యాడు. నా కూతురు జీవితం బాగుపడిందని మురిసిపోయేలోపే.. కొడుకు చనిపోయాడు. ఎంత పేరిచ్చాడో ఆ భగవంతుడు నాకు అన్ని కష్టాలను కూడా ఇచ్చాడు. ఇవన్నీ గుర్తు చేసుకుని అప్పుడప్పుడు ఒంటరిగా ఏడుస్తూ ఉంటా అంటూ కోట కన్నీరు పెట్టుకున్నాడు. ఇక అయినా తన కొడుకు మరణం గురించి ఆ బాధ నుంచి బయటపడ్డారా అనే ప్రశ్నకు.. మర్చిపోవడానికి ఇదేమైనా జ్ఞాపకమా.. జీవితం.. ఎలా మర్చిపోతానంటూ నెట్టూర్చేవాడు. కానీ.. నటనలో బిజీగా ఉండడంతో ఈ బాధను ఎంతో కొంత త‌గ్గించుకున్న అంటూ వివరించారు. ఎన్నో కష్టాలను ఒంట‌రిగా ఎదుర్కొన్న కోట.. నేడు (జూలై 14) ఉదయం అనారోగ్యంతో మరణించారు.