వీరమల్లు కోసం కోటా తీసుకున్న చివరి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

టాలీవుడ్ నటుడు కోట శ్రీనివాస్ మరణ వార్త ఒకసారి ఇండస్ట్రీని కుదిపి వేసింది. సినీ లోకాన్ని శోక సంద్రంలోకి నెట్టింది. ఆయన లేని లోటు ఎవ్వరు తీర్చలేరు అనడంలో సందేహం లేదు. ఏడాదికి 30 సినిమాలు.. రోజుకు 20 గంటల పాటు నటించి చివరి క్షణం వరకు ఇండస్ట్రీ కోసం కష్టపడినా కోటా శ్రీనివాస్.. తన సినీ కెరీర్‌లో విలన్‌గా కమెడియన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో పాత్రలో నటించే ఆకట్టుకున్నాడు. దాదాపు 750 పైగా సినిమాల్లో తనదైన నటనతో సత్తా చాటుకున్నాడు.

అయితే.. గత కొంతకాలంగా అనారోగ్య కారణాలతో సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన నటనను అంతా బాగా మిస్ అవుతున్నారు. మళ్ళీ ఆయనను వెండి తెరపై చూడాలని కోరుకుంటున్నారు. కానీ.. ఆరోగ్యం సహకరించకపోవడంతో కోట సినిమాల్లో నటించడం సాధ్యపడలేదు. ఈ క్రమంలోనే ఇంట్లో ఖాళీగా కూర్చుని బోర్ కొడుతుందని పవన్‌ని అడిగిమరీ హరిహర వీర‌మ‌ల్లు చిన్న క్యారెక్టర్ ద‌క్కించుకున్నాడు. అదే ఆయన చివరి సినిమా అవుతుందని ఎవరు భావించ‌లేదు. గమ్మత్తు ఏంటంటే కోటా శ్రీనివాస్ మొదటి సినిమా, చివరి సినిమా రెండు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాయి.

చిరంజీవి ప్రాణం ఖరీదు సినిమాతో ప్రారంభించిన‌ పవన్ కళ్యాణ్.. హరిహర వీరమల్లు సినిమాతో ఆయన కెరీర్‌ను ముగించారు. ఈ సినిమా ఈ నెల 24న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. సరిగ్గా మరో తొమ్మిది రోజుల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానున్న ఈ సినిమా కోటా శ్రీనివాసరావు చివరి సినిమా. ఈ క్రమంలోనే సినిమా కోసం ఆయన తీసుకున్న రెమ్యున‌రేష‌న్ వివ‌రాలు వైర‌ల్‌గా మారుతుంది. పెద్ద వయసు కనుక కథను ఇంపాక్ట్ చేసే రేంజ్‌లో క్యారెక్టర్ ఉండకుండా రెమ్యూనరేషన్ మాత్రం భారీగానే అందిందట. ఈ సినిమా కోసం ఆయన నాలుగు నుంచి ఐదు రోజుల కాల్ షీట్స్ కేటాయించి దానికి నాలుగు లక్షల రెమ్యూనరేషన్ అందుకున్నాడట. అంటే రోజుకు లక్ష రూపాయలు ఆయన తీసుకున్నాడు.