టాలీవుడ్‌లో తిరుగులేని నటుడుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న కోట శ్రీనివాస్.. తన సినీ కెరీర్‌లో 700కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఏ పాత్రలో నటించినా.. తనకంటూ ఓ ముద్ర వేసుకున్న ఆయన.. కొద్ది గంటల క్రితం తుది శ్వాస విడిచి టాలీవుడ్‌కు తీవ్ర విషాదాన్ని మిగిల్చారు. ఆయన నటించిన పాత్రలు అమరమైనవి. కామెడీ పండించినా, విలన్‌గా నటించిన, తన యాసతో మెప్పించినా.. ఇక పాత్ర ఏదైనా హావభావాలు, డైలాగులతో ఆడియన్స్ ఆకట్టుకోవడం ఆయన ప్రాధాన్యత.
ఈతరం, ఆతరం అని తేడా లేకుండా అందరి అభిమానాన్ని సంపాదించుకున్నాడు కోట. ఎంతోమంది ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు. అయితే.. ఆయన సినీ కెరీర్‌లో నటుడిగానే కాదు.. ఓ సినిమాలో ఆయన గాత్రాన్ని కూడా అందించాడు. రెండు సినిమాల్లో పాటలను పాడి మెప్పించాడు. వాటిలో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్.
ఈ మూవీలో మందు బాబులం మేము మందు బాబులం సాంగ్ ఆయన నాడింది. ఈ సాంగ్ అప్పట్లో ఎంతో ట్రెండ్ సృష్టించింది. ఈ పాటలో కొన్ని డైలాగ్లు, సన్నివేశాలు మీమ్స్‌గా మారి సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆయన ఎక్స్ప్రెషన్స్, లిరిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదే కాదు.. సిసింద్రీ సినిమాలో కూడా ఆయన ఒక పాటను ఆలపించాడు. ఓరి నాయనో సాంగ్.. ఆయన పాడిందే. కొన్ని కారణాలతో థియేటర్స్ లో ఈ సాంగ్ రిలీజ్ చేయలేదు.