టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్గా దేవి ప్రసాద్‌కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఆయన టాలెంటెడ్ సింగర్ గాను మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పటివరకు దాదాపు టాలీవుడ్ లో ఉన్న అందరూ స్టార్ హీరోలతోనూ పనిచేసిన దేవిశ్రీ.. తాను మ్యూజిక్ అందించిన అన్ని సినిమాలతో దాదాపు మంచి రిజల్ట్ అందుకున్నాడు. ఇక అల్లు అర్జున్, సుకుమార్, డిఎస్పీ కాంబో వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ బ్లాస్టే. అలా.. చివరిగా ఆయన నుంచి వచ్చిన పుష్ప 2 సినిమా.. ఏ రేంజ్ లో మ్యూజిక్‌తో మెప్పించిందో.. సినిమాలోని ప్రతిసాంగ్స్ సోషల్ మీడియాలో ఎంతలా హైలెట్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
లక్షల్లో రీల్స్, వీడియోస్‌తో ఇది వైరల్‌గా మారింది. ఇలాంటి క్రమంలోనే.. డిఎస్పీకి.. లక్కీ పేరు ఒకటి ఉందని.. తాను పాడే పాటల్లో ఆ పేరు కలిసిందంటే చాలు కచ్చితంగా సాంగ్ బ్లాక్ బస్టర్ అవుతుందని.. అందుకే ఇప్పటివరకు పలు సినిమాలలో ఆ పేరును చాలా సార్లు హైలెట్ చేశాడు అంటూ ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ పేరేంటి అనుకుంటున్నారా.. అదే మోనాలిసా. డిఎస్పి కి ఈ పేరంటే మొదటి నుంచి చాలా ఇష్టమట. అందుకే.. తాను మోనాలిసా అనే పేరును పవన్ కళ్యాణ్, చరణ్ సినిమాలలో పలు సాంగ్స్ లో వాడాడంటూ చెబుతున్నారు.
పవన్ కళ్యాణ్‌తో పని చేసిన డిఎస్పి.. అత్తారింటికి దారేది సినిమాలో నిన్ను చూడగానే చిట్టి గుండె సాంగ్‌లో మోనాలిస పదాన్ని వాడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కంటే ముందే వచ్చిన జల్సా సినిమాలోను జెనీఫర్ లోపే సాంగ్‌లో మోనాలిసా అనే పదాన్ని ఆయన ఉపయోగించారు. ఇక.. అప్పట్లో పవన్ సినిమాల్లో వాడినట్లే.. తర్వాత రామ్ చరణ్‌తో పనిచేసిన సమయంలోను వినయ విధేయ రామ సినిమాలో మోనాలిసా అనే పదాన్ని వాడాడు. అలా.. ఇప్పటివరకు డిఎస్పీ మోనాలిసా అనే పదాన్ని వాడి పాడిన పాటలన్నీ మంచి సక్సెస్లు అందుకున్నాయంటూ.. ఆయన కావాలనే ఆ పదాన్ని అంత హైలెట్ చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.