ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ లెవెల్‌లో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు రాంచరణ్. కాగా ఈ సినిమా తర్వాత వచ్చిన గేమ్ ఛేంజర్ ఆడియన్స్‌ను నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చరణ్ తన నెక్స్ట్ సినిమాతో ఆడియన్స్‌ను ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ అందుకుని ఫ్యాన్స్ కు స్ట్రాంగ్ ట్రిట్ ఇవ్వాలని కసితో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఇప్పటికే మూవీ పై భారీ హైప్ నెలకొంది. కారణం సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింన్స్. ఏ రేంజ్‌లో ఈ గ్లింప్స్ హైలెట్‌గా మారాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇలాంటి నేపద్యంలో చరణ్ ఫ్యాన్స్‌కు మరింత ఆనందాన్ని పెంచే ఒక క్రేజీ అప్డేట్ వైరల్‌గా మారుతుంది. త్వరలో పెద్ది కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. దీనికోసమే చరణ్ జిమ్‌లో చెమటలు చిందిస్తూ కండలు తిరిగిన వీరుడుగా మారిపోయాడు. హాండ్స్, బైనాప్స్ గట్టిగా పెంచి అదిరిపోయే లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. చరణ్ నయా లుక్ సంబంధించిన ఫొటోస్ తన సోషల్ మీడియా వేదికగా స్వయంగా షేర్ చేసుకున్నాడు ఈ మెగా హీరో. ఇది చూసిన అభిమానులు ఈసారి చరణ్ కుంభ స్థలం బద్ధలు కొడతాడంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాలో చరణ్ క్రికెట్, కబడ్డీ ఆటగాడిగా కనిపించనున్నాడని టాక్. అయితే ఇప్పుడు కనిపిస్తున్న బాడీ చూస్తే ఇదంతా యాక్షన్ సీన్స్ కోసమేనని అర్థమవుతుంది. ఈ రేంజ్ బాడీ తో ఫైట్ సీన్స్ ఉంటే ఫ్యాన్స్‌కు నెక్స్ట్ లెవెల్లో కిక్ వస్తుంది. ఇక సినిమా వచ్చే ఏడాది మార్చి 27న గ్రాండ్గా రిలీజ్ కానుంది. బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో జాన్వి కపూర్ హీరోయిన్గా, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించిన ఈ సినిమాపై.. ఆడియన్స్‌లో రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి సినిమా నుంచి ముందు ముందు ఇంకెన్ని సర్ప్రైజ్‌లు వస్తాయో ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తాయో వేచి చూడాలి.