పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత ఆయన నుంచి వస్తున్న మొట్టమొదటి సినిమా హరిహర వీరమల్లు. దాదాపు ఐదున్నరేళ్ల షూట్ తర్వాత ఈ సినిమా ఎట్టకేలకు పూర్తై.. మరికొద్ది గంటల్లో గ్రాండ్గా రిలీజ్‌కు సిద్ధమైంది. ఇక సినిమా ప్రీమియర్ షోస్ సైతం కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు రాత్రి 9:00 నుంచి ప్రారంభమవుతాయి. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఎక్కడ చూసినా వీరమల్లు సినిమా రిజల్ట్ గురించే చర్చలు జరుగుతున్నాయి. అయితే.. పలుచోట్ల మాత్రం బాయికాట్ హరిహర వీరమల్లు అనే ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు హెటర్స్.
వీరమల్లు సినిమాలో బాయికాట్ చేయాలంటూ వైసీపీ శ్రేణులతో పాటు.. మరి కొంత మంది ఇతర స్టార్ హీరోల ఫ్యాన్స్ కూడా ట్విట్‌లు చేస్తున్నారు. అయితే.. ఇంతలా వాళ్లు నెగటివ్గా సినిమాను ట్రోల్ చేయడానికి కారణం తాజాగా విరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోపవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ అట. సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు అని చెప్పిన పవన్ కళ్యాణ్.. సినిమా ఫంక్షన్ లో రాజకీయాలపై మాట్లాడుతూ కామెంట్స్ చేయడం ఎందుకు అంటూ మండిపడుతున్నారు. ఇక పవన్ మాట్లాడుతూ.. నేను క్రియాశీలకంగా రాజకీయాల్లోకి వచ్చాకనే రియల్ లైఫ్ గుండాలను, రౌడీలను ఎదుర్కోవాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు.
సినిమాల్లో మాత్రం ఫైట్లు చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చేదని.. అందుకే ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్షను మళ్లీ వీకమల్లు కోసం తిరిగి ప్రాక్టీస్ చేశా అంటూ వివరించాడు. ఇప్పుడు ఈ మాటలు సినిమా రిలీజ్ కు అడ్డంకులుగా మారాయి. పవన్ సైతం ఈ బాయ్‌కాట్ వీరమల్లు పై రియాక్ట్ అయ్యారు.. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో రాజకీయ ప్రత్యర్థులు సినిమాను బహిష్కరించాలని అడుగుతున్నారని ప్రశ్నించగా.. పవన్ ఎందుకు అంటూ ప్రశ్నించాడు. వ్యక్తిగత కక్ష సాధింపు తప్ప.. వేరే పెద్ద కారణాలేవి లేవని ఆయన చెప్పుకొచ్చాడు. దానిని ఉద్దుశించి ఓ నవ్వు నవ్వాడు. మరి ఈ రాజకీయాలు వేడి సినిమాకు ఎలాంటి సెగ కలిగిస్తుందో వేచి చూడాలి. అంతేకాదు.. నెగిటివ్ ప్రచారం వీరమల్లు వసూళ్లపై కూడా పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు రిలీజ్ కోసం ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్న వీరమల్లు ఈ నెగటివ్ ప్రచారాన్ని సైతం ఎదుర్కొని స్ట్రాంగ్ గా నిలబడి రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాలి.