టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్గా సందీప్ రెడ్డివంగా ఎలాంటి పాపులారిటీ దక్కించుకున్నాడో తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ దర్శకుడుగా పరిచయమైన సందీప్ అదే సినిమాను కబీర్ సింగ్‌గా బాలీవుడ్ రీమేక్ చేసి మంచి ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇక చివరిగా ఆయన రూపొందించిన యానిమల్ సినిమా బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేయడమే కాదు.. బాలీవుడ్‌ను సైతం గడగడ లాడించింది. సంచలన వసూళ్లను కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేసింది. ఇది చాలా మందికి నచ్చలేదు. ఈ క్రమంలోనే ఎంతో మంది ఇండస్ట్రీ స్టార్ సెలబ్రిటీస్ సినిమాపై యుద్ధాన్ని ప్రకటించి అభ్యంతరాలు లేవనెత్తారు. వారందరికీ సందీప్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ దీటుగా సమాధానాలు చెప్పాడు.
ఆయన అడిగిన ప్రశ్నలకు వారి దగ్గర సమాధానం లేదు. బాలీవుడ్ ప్రముఖులు.. అలాగే అక్కడ మీడియా ఈ సినిమాని తీవ్రంగా వ్యతిరేకించడం సినిమాను మెచ్చిన వాళ్లు కూడా బహిరంగంగా అభిప్రాయాన్ని చెప్పలేని పరిస్థితి నెలకొల్పింది. అందులో నేను కూడా ఒకరిని అంటూ తాజాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మోహిత్ సూరి వివరించాడు. ఆషికి 2, ఏక్ విలన్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన ఆయన.. లేటెస్ట్గా సైయారతో ఆడియన్స్‌ను పలకరించి మంచి హిట్ అందుకున్నాడు. సైయార ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మోహిత్.. సందీప్‌పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. నేను సందీప్ కు పెద్ద ఫ్యాన్ అని.. స్టేట్మెంట్ ఇచ్చాడు.
యానిమల్ సినిమా తనకు విపరీతంగా నచ్చేసిందని.. ప్రతి సీన్‌లోను డైరెక్టర్ మార్క్ కనిపించిందని.. ఈ సినిమా చూశాక నేను పర్సనల్గా సందీప్‌కు మెసేజ్ పెట్టా అంటూ వివరించాడు. యానిమల్ రిలీజ్ అయినప్పుడు సగం ప్రపంచం సందీప్‌కు వ్యతిరేకంగా మారింది. ఆ సినిమా నచ్చిన వాళ్లు కూడా ఓపెన్ గా ఒపీనియన్ చెప్పలేని పరిస్థితి నెలకొంది. నేను అప్పుడు సోషల్ మీడియా నుంచి బయటకు వచ్చేసా. అందుకే.. సందీప్‌కు పర్సనల్గా మెసేజ్ చేశా. ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వకపోవడం నా తప్పే. అందుకు నేను సందీప్‌ని క్షమాపణలు అడుగుతున్నా అంటూ మోహిత్ కామెంట్స్ చేశాడు. సందీప్ ఎంతో నిజాయితీగల వ్యక్త అని.. చాలా జెన్యూన్, కన్వెన్షన్‌తో సినిమాలు రూపొందిస్తాడని మోహిత్ ప్రశంసించాడు. ప్రస్తుతం మోహిత్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి.