చిరు కోసం భీమ్స్ కోట్ల‌ త్యాగం.. అభిమానాన్ని భ‌లే చూపించాడుగా..!

టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవికి ఇండస్ట్రీలో ఎలాంటి క్రెజ్‌, పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం సాధర‌ణ‌ ఆడియన్స్ కాదు.. సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న ఎంతోమంది సెలబ్రిటీస్‌కు సైతం ఫేవ‌రెట్‌ హీరోగా మారిపోయిన చిరంజీవి.. మెగాస్టార్‌గా తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకుంటున్నారు. ఏడుపాదుల వయసులోనూ ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటి ఇస్తూ.. తన నటన, డ్యాన్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇక చిరు చాలాకాలం నుంచి.. మల్లిడి వశిష్ఠ‌ డైరెక్షన్‌లో విశ్వంభర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Vishwambhara Teaser | Vishwambhara Trailer | Chiranjeevi | Movie Mahal

ఈ సినిమా మొదట ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 10న రిలీజ్ చేయాలని టీం భావించారట‌. కానీ.. సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ పనులు పెండింగ్ ఉన్న క్రమంలో సినిమా రిలీజ్ ను ఆపేశారు. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను ఇప్పటివరకు ప్రకటించలేదు. అయితే.. తాజాగా సినిమా రిలీజ్ డేట్ సెప్టెంబర్ లోనే ఉంటుందంటూ న్యూస్ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఒకే ఒక్క సాంగ్ మినహా మొత్తం షూటింగ్ కంప్లీట్ అయిందని టాక్. ఇక మిగిలిన ఈ సాంగ్ మూవీలో స్పెషల్ సాంగ్ అని.. ఈ సినిమా మొత్త‌దానికి కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా.. ఒక్క స్పెషల్ సాంగ్‌కు మాత్రం కీరవాణిని కాకుండా.. టాలీవుడ్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న బీమ్స్‌ సిసిరోలియోను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తుంది.

Music Director Bheems Ceciroleo Emotional Speech @ #SankranthikiVasthunam  Musical Night

ఇప్పుడు బీమ్స్‌ ఈ సాంగ్ కోసం మ్యూజిక్ అందిస్తున్నాడట. ఇక ప్రస్తుతం అద్భుతమైన జోష్‌లో దూసుకుపోతున్న బీమ్స్‌.. ఒక్కో సినిమాకు ఏకంగా నాలుగు కోట్ల రెమ్యునరేషన్‌ను అందుకుంటున్నాడు. అయితే.. చిరంజీవి సినిమాలో ఆయన చేస్తుంది ఒక్క సాంగ్ అయినా.. ఈ సాంగ్ కోసం మాత్రం ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ అందుకోవడం లేదని సమాచారం. ఇక చిరంజీవి, అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెర‌కెక్క‌నున్న ఈ మెగా 157 సినిమాకు కూడా భీమ్సే సంగీతం అందించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విశ్వంభ‌రకు రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని న్యూస్ వైరల్ అవడంతో.. మెగా ఫ్యాన్ తెగ మురిసిపోతున్నారు. చిరు పై అభిమానాన్ని బీమ్స్ భ‌లే చూపించాడు అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.