టాలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండేకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాలో లిప్ లాక్ లు, గ్లామర్ షోలతో కుర్ర కారుకు చెమటలు పట్టించిన ఈ చిన్నది.. కెరీర్‌లో ఫస్ట్ సినిమాతోనే హైలెట్ గా నిలిచింది. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అయితే.. ఈ సినిమా తర్వాత అమ్మడుకు సరైన అవకాశాలు రావడం లేదు. ఒకవేళ వచ్చిన అన్ని బోల్డ్ రోల్స్ లోనే నటించాల్సి వస్తుంది.
ఈ క్రమంలోనే షాలిని.. మెల్లమెల్లగా సినిమాలకు దూరమైంది. కాగా.. చాలా కాలం తర్వాత అమ్మడు మరో టాలీవుడ్ సినిమాకు సైన్ చేసిందంటూ టాక్ వైరల్ గా మారుతుంది. అది కూడా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోయే సినిమా కోసం ఆమె నటించనుందట. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తారక్ హీరోగా డ్రాగన్ మూవీ రూపొందుతుంది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా.. సెకండ్ హీరోయిన్గా రష్మిక మందన మెరవనుందట. అయితే.. ఈ సినిమా తర్వాత తారక్ దేవర 2 సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు.
ఈ సినిమాల్లో ఇప్పటికే జాన్వి కపూర్ హీరోయిన్గా పిక్స్ అయిపోయింది. ఇక సినిమాలో సెకండ్ హీరోయిన్ రోల్ కోసం షాలిని పాండేను మేకర్స్ సెలెక్ట్ చేసుకున్నారని సమాచారం. అయితే.. ఆమె క్యారెక్టర్ లెంగ్త్ మాత్రం చాలా తక్కువగానే ఉంటుందట. పాత్ర త్వరగానే మరణిస్తుందని.. కానీ సినిమాకు ఎమోషనల్ గా హైలెట్గా మారనుందని సమాచారం. ఈ క్రమంలోనే షాలిని కూడా ఆ ఆఫర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. పైగా.. ఇప్పటికే షాలిని తన ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ అంటూ ఎన్నో సందర్భాల్లో వివరించింది. అలా తన అభిమాన హీరోతో నటించే ఛాన్స్ ను మిస్ చేసుకోకుండా నటించడానికి ఒప్పేసుకుందని టాక్ ఇండస్ట్రీ వక్గాలలో తెగ వైరల్ గా మారుతుంది.