ఈ ఏడది బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా లెవెల్‌లో ఎన్నో సినిమాలు రిలీజై భారీ సక్సెస్ అందుకున్నాయి. ఛావా, జురాసిక్ పార్క్, సితారే జమీన్ పర్, సైయ్యరా లాంటి సినిమాలు తక్కువ బడ్జెట్ లో రూపొంది మంచి కలెక్షన్లు కొల్లగొట్టాయి. ఇక ఇప్పుడు మరో సినిమా ఈ సినిమాలన్నింటినీ మించి పోయే రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలను క్రియేట్ చేస్తుంది. 2025 లోని అతిపెద్ద హిట్ మూవీగా ఇది క్రేజ్ దక్కించుకుంది.
2 గంటల 10 నిమిషాల నడివితో రూపొందిన ఈ సినిమాను.. సరికొత్త రూపంలో ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చారు మేకర్స్. ఇంతకీ.. మూవీ పేరు చెప్పలేదు కదా.. అదే మహావతార నరసింహ. ఇది యానిమేటెడ్ పౌరాణిక సినిమా. జులై 25న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా.. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్లో రూపొందింది. ఇక సినిమా రిలీజ్ అయిన ఐదు రోజుల్లోనే.. దాదాపు రూ.30 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. మొదటి రోజు 1.5 కోట్లు, రెండవ రోజు రూ.4.6, మూడవ రోజు రూ.9.5, నాలుగవ రోజు రూ.6 కోట్లు, ఐదవ రోజు రూ.7.7 కోట్లు కలెక్షన్‌లను దక్కించుకుంది.
ఇలా రోజురోజుకు కలెక్షన్లను పెంచుకుంటూ పోతున్న ఈ సినిమా.. పాన్ ఇండియా లెవెల్‌లో రూ.29.55 కోట్ల వసూళ్లను అందుకుంది. ఇక IMDbలో 9.7 రేటింగ్‌ను సంపాదించుకుంది. ఈ సినిమాలో ఏ స్టార్ హీరో, హీరోయిన్ లేకున్నా.. పెద్ద పెద్ద కాస్టింగ్ టెక్నీషియన్స్ లేకున్నా.. ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవ్వడంతో జనాలు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మహావతార నరసింహ సంచలనం సృష్టిస్తూనే ఉంది. ఇక ఫైనల్ రన్ ముగిసేసరికి సినిమా ఇంకెన్ని రికార్డులను ఖాతాలో వేసుకుంటుందో చూడాలి.