20 రోజులు ఓ మంత్రి కూతురుని తన ఇంట్లో ఉంచుకొని పంపిన స్టార్ హీరో.. ఎవరంటే..?

ఇండ‌స్ట్రీలో హీరోలు, హీరోయిన్లు, స్టార్ సెలబ్రిటీలకు ఎవరికైనా చాలామంది వీరాభిమానులు ఉంటారు. సాధారణ ప్రేక్షకులే కాదు.. ఇతర సెలబ్రిటీల సైతం తమ అభిమానించే స్టార్ హీరోలను ప్రత్యక్షంగా చూడాలని ఆరాటపడుతూ ఉంటారు. వాళ్ళను కలిసి మాట్లాడాలని.. చూఏడాల‌ని పరితపిస్తారు. ఇక కొంతమంది స్టార్ హీరోలకు.. లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే.. తమ ఫేవరెట్ హీరోను కలవాలని కోరుకుంటారు. అలా గతంలో ఓ లేడీ ఫ్యాన్.. స్టార్ హీరో కోసం చేసిన పని సంచలనం సృష్టించింది. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రోకాదు బాలీవుడ్ నటుడు గోవింద్. అత‌ని చూసేందుకు ఓ లేడీ అభిమాని చేసిన పని గురించి ఆయన భార్య సునీత ఆహుజా తాజాగా వెల్లడించింది.

Sunita Ahuja recalls first meeting with now-husband Govinda when she was in  Class 9, he was in college: 'Was told no girl could impress him' |  Bollywood News - The Indian Express

బాలీవుడ్ స్టార్ హీరో గోవింద క్రేజ్ గురించి ఈ జనరేషన్ వారికి తెలియకపోవచ్చు. కానీ.. గతంలో గోవింద మేనరిజం.. హీరోయిజం.. తెలియని సినీ ప్రియులు ఉండేవారు కాదు. ఖాన్‌ త్రయానికి పోటీగా సినిమాలను చేసి తన సత్తా చాటుకున్నాడు. 1986లో రిలీజ్ అయిన ఇల్జం సినిమాతో కెరీర్ ప్రారంభించిన గోవింద.. తర్వాత ప్రజలకు తన నటనతో మరింత దగ్గరయ్యాడు. బాగా నవ్వించాడు. తన కామెడీ స్టైల్ ఇష్టపడని ఫ్యాన్స్ అంటూ ఉండేవాళ్లు కారు. అంతలా క్రేజ్, పాపులారిటీ దక్కించుకున్న గోవింద తర్వాత పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి.. మెల్లమెల్లగా సినిమాలకు దూరమయ్యాడు.

అంతేకాదు.. కాంగ్రెస్ తరపున పోటీ చేసే ఎంపీగాను సక్సెస్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే గోవింద ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తాజాగా ఆయన భార్య సునీత ఆహుజా ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. ఓ ఫోడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో సునీత మాట్లాడుతూ.. మా పెళ్లయిన కొత్తలో ఓ యువతీ పని కోసం అని మా ఇంటికి వచ్చింది. సరే అని తీసుకున్నా.. కానీ ఆమెకు కనీసం గిన్నెలు తోమడం కూడా రాదు. ఇల్లు శుభ్రం చేయడం రానే రాదు. కేవలం గోవిందను చూసేందుకు ఆమె నిద్రమానుకుని మరీ వేచి చూస్తూ ఉండేది అంటూ సునీత చెప్పుకొచ్చింది. దాదాపు 20 రోజులు ఆమె మాతోనే ఉందని సునీత చెప్పుకొచ్చింది.

Superstar Govindas wife Sunita Ahuja tells all about equation with her  husband

తన పేరే రూపా అని.. ప్రవర్తన తీరు చూస్తే చాలా రిచ్ అమ్మాయిల కనిపించేది.. ఎంత ఆలస్యమైనా సరే నిద్రపోకుండా గోవింద కోసం ఎదురు చూస్తూ ఉండేది.. చివరికి ఆమె తీరుపై సందేహం వచ్చి ఎవరా అని ఆరా తీశా. ఆమెను గట్టిగా అడిగితే నా ముందే కన్నీళ్లు పెట్టుకుంది.. నేను గోవింద అభిమానిని.. నేనొక మినిస్టర్ కూతురిని అని చెప్పుకొచ్చింది అంటూ క్లారిటీ ఇచ్చింది. తర్వాత ఆమె తండ్రి నాలుగు వాహనాలతో వచ్చే ఆమెను ఇంటికి తీసుకువెళ్లారని సునీత వివరించింది. ఇక గోవింద చివరిగా రంగీలా రాజా అనే సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు. తర్వాత గోవింద మరో సినిమాలో నటించ లేదు. ప్ర‌స్తుతం రాజకీయాలకు సైతం దూరంగానే ఉంటున్నాడు.