ఏపి డిప్యూటీ సీఎం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా సినిమా థియేటర్ల బంద్ వివాదం పై రియాక్ట్ అవుతూ టాలీవుడ్ పై సీరియస్ అయినా సంగతి తెలిసిందే. గత నెల 24న పవన్ కళ్యాణ్.. సినీ పరిశ్రమ తీరుపై ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి, పరిశ్రమకు హోదా కల్పించి.. అభివృద్ధి చేయాలని.. రంగంలో గౌరవ మర్యాదలను భంగం వాటిల్లకుండా మరింత ప్రతిష్టాత్మకంగా చూడాలని.. ఏపీ ప్రభుత్వం ఎంతగానో ఆరాటపడుతుంది. అయినా.. తెలుగు సినీ రంగంలో ఉన్న వాళ్లకు ఈ ప్రభుత్వం పట్ల కనీసం మర్యాద, కృతజ్ఞత కూడా లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైనా.. సీఎంగారిని కలిసేందుకు తెలుగు చలనచిత్రం మండలి, ఇతర ముఖ్యులు కనీసం ఒక్కసారి కూడా ప్రయత్నం చేయలేదని.. ఎందుకు మర్యాదపూర్వకంగా కలవలేకపోయారంటూ ప్రశ్నించాడు.
కేవలం వాళ్ళ సినిమాల రిలీజ్ కు ముందు మాత్రం ప్రభుత్వం దగ్గరకు వచ్చి టికెట్ రేట్లు పై చర్చిస్తారు తప్ప.. సినీ రంగం అభివృద్ధి కోసం భేటీ ఎవ్వరు కాలేదని.. గతంలో నేను స్వయంగా సినీ ప్రముఖులంతా కలిసి రావాలని సూచించినా.. వారి నుంచి సానుకూల స్పందన లేదంటూ.. ఈ వైఖరి సరైనది కాదంటూ పవన్ కళ్యాణ్ అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు, నటులంతా.. ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీకి సిద్ధమవుతున్నారు. ఈ నెల 15వ తేదీన ఉండవల్లిలోని సీఎం నివాసం వద్ద సాయంత్రం నాలుగు గంటలకు ఈ మీటింగ్ జరగనుందని సమాచారం. దీనికి సంబంధించిన ప్లేస్ తో పాటు.. అపాయింట్మెంట్ డీటెయిల్స్ అన్ని ఫిక్స్ అయిపోయాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ మీటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది.
కాగా ప్రస్తుతం సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ షూట్‌లో బిజీగా గడుపుతున్నాడు పవన్. ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రముఖులతో సీఎం భేటీలో పవన్ పాల్గొంటాడా.. లేదా.. అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక.. ఇప్పటికే టాలీవుడ్ సినీ రంగంలోని ప్రముక నటులతో పాటు.. సీఎం చంద్రబాబు ఇతర ప్రముఖులకు సైతం అపాయింట్మెంట్‌కు సంబంధించిన వివరాలన్నీ చేరాయి. ఈ క్రమంలోనే ఈ నెల 15న ప్రముఖులంతా కలిసి మీటింగ్కు హాజరు కావాలని రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ కి సంపాదించుకున్న.. ప్రముఖులందరికి.. సినీ పరిశ్రమకు.. ఏపీ ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం అందిస్తామని.. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.