ఇటీవల ఓ సినిమా ప్రమోషన్స్‌లో కమలహాసన్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ నెటింట ఎంత దుమారం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కమల్ మాట్లాడుతూ.. కన్నడ భాష.. తమిళ భాష నుంచి పుట్టింది అంటూ కామెంట్స్ చేశారు. దీంతో కన్నడ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అంతేకాదు.. ఈయనపై ఇప్పటికే కన్నడలో ట్రోలింగ్స్ మొదలైపోయాయి. ముఖ్యంగా కమల్ హాసన్ మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని.. అప్పుడే థగ్ లైఫ్ సినిమా కన్నడ ఇండస్ట్రీలో రిలీజ్ అవుతుందని.. లేదంటే సినిమాను నిషేధిస్తామంటూ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున బ్యాన్ థగ్ లైఫ్ నినాదాలను ట్రెండ్ చేస్తూ వస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఓ హీరోయిన్ సైతం కమల్ హాసన్ కామెంట్లపై రియాక్ట్ అవుతూ.. సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. గాడిదలకు ఎక్కువ విలువకూడదు అంటూ ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు నటి రమ్య. ఆమె కన్నడ యాక్ట్రెస్ అయినా.. కమల్ హాసన్ మాటలకు సపోర్ట్ ఇస్తూ ఓ పోస్ట్ షేర్ చేసుకుంది. కమల్ హాసన్ పెద్ద నటుడు. ఆయనను విమర్శించడం అంత మంచి విషయం కాదంటూ చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ఆయన మాట్లాడిన మాటలకు సినిమా మొత్తాన్ని బ్యాన్ చేయాలనుకోవడం అసలు సరైనది కాదంటూ చెప్పుకొచ్చింది. ఎవరి భాష వాళ్లకు గొప్పది.
ఒక భాష కంటే మరో భాష గొప్పది కాదని కమలహాసన్ మాట్లాడిన మాటలు తప్పు.. కానీ ఆయన వల్ల సినిమాను బ్యాన్ చేయాలనుకోవడం మనం చేసే తప్పే అంటూ రమ్య వివరించింది. ఈ క్రమంలోనే రమ్య పై సైతం కన్నడియులు విమర్శలు గుప్పిస్తున్నారు. కన్నడ ఇండస్ట్రీలో ఎదిగిన హీరోయిన్‌వి. నువ్వు.. నీ భాషను తక్కువ చేసి మాట్లాడితే వ్యతిరేకించాల్సింది పోయి.. సపోర్టుగా మాట్లాడుతున్నావా అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మొదలుపెట్టారు. అయితే.. ట్రోలింగ్స్ ను ఉద్దేశిస్తూ రమ్య.. గాడిదలకు ఎక్కువగా విలువ ఇవ్వకూడదు అంటూ షాకింగ్ పోస్ట్ షేర్ చేసుకుంది. మీ విలువైన టైం వృధా చేయకండి. చెత్త మార్గం ఏంటంటే.. నిజం ఏంటో తెలియకుండా మాట్లాడే మూర్ఖుల.. అర్థం లేని వాదనల గురించి మాట్లాడడం. అలాంటి వాదనల్లో జోక్యం మంచిది అంటూ చెప్పుకొచ్చింది. అయితే రమ్య చేసిన పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ గా మారుతుంది.