వెనక్కి తగ్గే ఛాన్సే లేదంటున కనప్ప.. వీరమల్లుకి కొత్త కష్టం..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఎప్పుడెప్పుడు అంటూ కళ్ళు కాయలు కాచెలా ఎదురుచూస్తున్న వార‌మ‌ల్లు మూవీ జూన్ 12న రిలీజ్ కాబోతుందంటూ మేకర్స్‌ అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మరోసారి వాయిదా పడింది అంటూ టాక్‌ నడుస్తుంది. నిన్న ఉదయం ఈ వార్తలు సోషల్ మీడియాలో లీకైన క్షణాల్లోనే.. అభిమానుల్లో సినిమాపై ఆశ ఆవిరైపోయింది. జూన్ 12న థియేటర్లలో గ్రాండ్‌గా సినిమాను సెలెబ్రేట్ చేసుకోవాలని ఫ్యాన్స్ ప్లాన్ చేసుకున్నారు. పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో అభిమానుల్లో కనీవినీ ఎరుగని రేంజ్ లో సంబరాలు మొదలైపోయాయి. కానీ.. విఎఫ్‌ఎక్స్ వర్క్‌ ఇంకా బ్యాలెన్స్ ఉండడం.. సమయానికి డెలివరీ కాకపోవడంతో.. మేకర్స్ సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారట. మరి.. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది మరోసారి ప్రశ్నగా మారింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈనెల 26న సినిమా రిలీజ్ చేయనున్నారని టాక్. ఇక ఇదే వాస్తవం అయితే.. సినిమా రిలీజ్ అయిన మరుసటి రోజునే కన్నప్ప సినిమా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. ఇలాంటి క్రమంలో.. వీరమల్లు టీం కన్నప్ప మేకర్స్ ను కలిసి సినిమా వాయిదా వేసుకోవాలని కోరారట. వాళ్ళు ససేమీరా సినిమాను వాయిదా వేయడం కుదరదు.. మేము ఈ రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసి మూడు నెలలు అవుతుంది.. చిన్న సినిమా అయితే కచ్చితంగా తప్పుకునే వాళ్ళం.. కానీ ఏకంగా రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు చేసి మరీ సినిమా రూపొందించాం. బ‌యర్స్‌ని కూడా అన్ని ప్రాంతాల్లో సిద్ధం చేసాం. ఇలాంటి టైం లో వాయిదా వేస్తే మాకే బాగా నష్టం జరుగుతుంది అంటూ వివరించారట. నిజానికి కనప్ప టీం చెప్పిన దానిలో కూడా వాస్తవం ఉంది.

కనుక.. పవన్ అభిమానులు కూడా సినిమా రిలీజ్ డేట్ విషయంలో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక 20న రిలీజ్ చేద్దాం అంటే నాగర్జున ధనుష్ కాంబోలో కుబేర సినిమా జూన్ 20న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా నిర్మాత సునీల్ నారంగ్‌కి పవన్ కళ్యాణ్ కు మధ్య ధియేటర్ల విషయంలో కోల్డ్ వారు జరుగుతుంది అంటూ టాక్‌ నడుస్తుంది ఇలాంటి క్రమంలో జూన్ 20న కూడా వీరమల్లును రిలీజ్ చేయలేరు. ఈ రెండు తేదీల్లో కాకుండా జులై 4న రిలీజ్ చేస్తే బాగుంటుందనే ఆలోచనలో టీమ్ ఉన్నారట. కానీ.. ఆ రోజున కూడా విజ‌య్‌ దేవరకొండ కింగ్‌డం సినిమా రిలీజ్ అవుతుంది. అంతేకాదు ఇదే రోజున పలు హాలీవుడ్ బడా సినిమాలో సైతం రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే వీరమల్లు సినిమా జులై 4న కూడా రిలీజ్ చేయడం కుదరదు. దీంతో జులై 20న సినిమా రిలీజ్ చేయాలని టీమ్ ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. జూన్ 12న మాత్రం సినిమా వాయిదా పడితే మళ్లీ వీరమల్లు రిలీజ్‌కు సమస్యలు తప్పవు అనడంలో అతిశయోక్తి లేదు.