అప్పుడు నా వల్లే తారక్ ఎక్కి ఎక్కి ఏడ్చాడు.. మంచు మనోజ్

సాధారణంగా.. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలంతా ఎంతో స్నేహంగా ఉంటారు. వారి మధ్యన సినిమాలపరంగా గట్టి పోటీనే ఉన్నా.. పర్సనల్గా మాత్రం వారి మధ్యన స్ట్రాంగ్ స్నేహబంధాలు కూడా ఉంటాయి. వ్యక్తిగతంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ.. కష్టసుఖాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. అలా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్నేహితులుగా ఉన్న హీరోలు ఎంతోమంది ఉన్నారు. ఒకరికి ఒకరు సపోర్ట్‌గా నిలిచి రెగ్యులర్గా కలిసి పార్టీలు చేసుకునే సెలబ్రిటీలు సైతం ఉన్నారు. ఇండస్ట్రీలో అలా మంచి బాండింగ్ కలిగి ఉన్న హీరోలలో మంచు మనోజ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. వీళ్ళ స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు వేరే వేరే సినీ కుటుంబాల నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన.. వీరి మధ్య స్నేహబంధం మాత్రం స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇద్దరు ఒకేరోజు (1983 మే 20న జన్మించారు) చిన్నతనం నుంచి వీళ్ళు మంచి ఫ్రెండ్స్‌గా కలిసిమెలిసి పెరిగిన నేపథ్యంలో.. ఒకరి గురించి ఒకరికి అంతా బాగా తెలుసు.

ఎన్టీఆర్ కోసం వాడి చెయ్యి విరగ్గొట్టిన మంచు మనోజ్.. ఆ కథ ఏంటని అడిగితే! |  Manoj reveales childhood incident with NTR - Telugu Filmibeat

నందమూరి తారకరామారావు మనవడిగా.. ఎన్టీఆర్, మంచు మోహన్ బాబు తనయుడుగా మనోజ్ ఇద్దరు న‌ట‌వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమకంటూ మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఇక మనోజ్ మెల్లమెల్లగా సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. తాజాగా రియంట్రి ఇచ్చిన సంగతి తెలిసిందే. తారక్ మాత్రం ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే మనోజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనే సందడి చేశాడు. చిన్నప్పుడు తారక్‌తో ఉన్న ఫన్నీ ఇన్సిడెంట్లు పంచుకున్నాడు. చిన్నతనంలో తారక్, నేను కలిసి ఓ సైంటిఫిక్ ఎక్స్పరిమెంట్ చేసామని ఐద‌వ‌ క్లాస్ లో ఉన్నప్పుడు ఇద్దరం కలిసి.. ఓ ఫంక్షన్ లో ఆడుకుంటున్నాం. అలాంటి క్రమంలో బెలూన్స్‌తో ప్రయోగం చేద్దామని భావించాం. తార‌క్‌కు బెలూన్ ను పట్టుకొని వెలిగిస్తున్నాడు. నేను దాన్ని పగలగొట్టడంతో.. ఆయన చేతికి అది అంటుకుంది.

నాకు బాగా గుర్తు ఆరోజు తారక్ ఎక్కి ఎక్కి ఏడ్చేశాడు. మా అమ్మమ్మ ఆదిలక్ష్మమ్మ వచ్చి సులగలు తీసుకొని వాయ కొట్టేసింది. బిడ్డను చంపేస్తావా అంటూ చితక్కొట్టింది అంటూ నవ్వుతూ చిన్ననాటి మెమరీస్‌ని షేర్ చేసుకున్నాడు మంచు మనోజ్. ఇదే ఇన్స్టెంట్ తారక్ గతంలో మంచు లక్ష్మి పోస్ట్ చేసిన ఇంటర్వ్యూలో చెప్పి నవ్వించిన సంగతి తెలిసిందే. ఇక మనోజ్.. ప్రభాస్ గురించి మాట్లాడుతూ ప్రభాస్ కి నాకు మధ్యన చాలా మంచి బాండింగే ఉంది.. తనపై నాకు ఎంతో రెస్పెక్ట్ ఉంది. ఆయన సినిమాలకు నేను పెద్ద అభిమానిని.. వ్యక్తిగతంగా ఆయన స్నేహితుల కోసం.. కావాల్సిన వాళ్ల కోసం.. కష్టాల్లో ఉన్న వాళ్ళ కోసం.. నిలబడే విధానం గ్రేట్ క్వాలిటీ. ఒకరికి సహాయం చేయాలంటే గొప్ప మనసు ఉండాలి. అలాంటిది.. ఎంతోమందికి సహాయం చేసే బంగారం లాంటి మనసు ప్రభాస్‌కు ఉంది. ప్రభాస్ గోల్డెన్ హార్డ్ పర్సన్ అంటూ మనోజ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మనోజ్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.