సినీ ఇండస్ట్రీ అంటే ఒకప్పుడు భాషా భేదాలు.. సౌత్, నార్త్ అనే తేడాలు ఉండేవి. కానీ.. ఇప్పుడు అంతా ఒకటే పాన్ ఇండియాగా మారిపోయింది. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాలు వరకు ప్రతి ఒక్కటి పాన్ ఇండియా కాన్సెప్ట్‌తో రూపొందించి ఆడియన్స్‌ను ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ కొట్టాలని దర్శకులు కష్టపడుతున్నారు. ఇక తమిళ్ ఇండస్ట్రీలో దర్శకులు ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు తీసి ఎంటర్టైన్ చేయడంలో ముందుంటారన్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు వరకు వాళ్ళు చేసిన ప్రతి సినిమా మంచి సక్సెస్ అందుకుంది. అంతేకాదు.. తెలుగులోనూ డబ్ అయ్యి ఇక్కడ కూడా మంచి రిజల్ట్స్ తెచ్చుకున్నాయి. అయితే.. ఇటీవల కాలంలో తమిళ్ సినిమాల క్రేజ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. వచ్చే పాన్ ఇండియన్ సినిమాలు సైతం సక్సెస్ అందుకోలేక డీలా పడుతున్నాయి.
కేవలం తెలుగు, తమిళ్ మార్కెట్లో మాత్రమే మంచి కలెక్షన్లు సాధిస్తున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో భారీ సక్సెస్‌ని సాధించాలని స్టార్ హీరోలు ఎంతగా ప్రయత్నిస్తున్న ఏదీ వర్కౌట్ కానీ పరిస్థితి. ఇలాంటి క్రమంలో.. అభిషన్ జీవంత్.. అనే ఓ యంగ్ డైరెక్టర్ టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు.. సెలబ్రిటీలను సైతం మెప్పించింది. రాజమౌళిని సైతం ఈ సినిమా ఇంప్రెస్ చేసిందంటే ఏ రేంజ్ లో స్టోరీ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకు రాజమౌళి స్వయంగా ట్విట్టర్ ద్వారా రివ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓ ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫామ్ అయిన జియో హాట్ స్టార్ లో ఈ సినిమా తెలుగు స్ట్రీమింగ్ అవుతుంది. ఇక రాజమౌళికి సైతం ఈ సినిమా విపరీతంగా నచ్చడానికి ఒకే ఒక్క సీన్ కారణమట.
ఆ సినిమాలో ఒక కాలనీలో నివసించే మనుషులు ఒక్కొక్కరు ఒక్కో ప్రాబ్లంతో రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. టూరిస్ట్ ఫ్యామిలీ గా వచ్చిన ఈ కుటుంబం వాళ్ళందరికీ అండగా నిలిచి వాళ్ళ కష్టాలను తీర్చేందుకు ప్రయత్నాలు చేస్తారు. కాగా.. ఈ సినిమాలో ఒక ఆమె చనిపోతే చుట్టుపక్కల వారెవరు పట్టించుకోని పరిస్థితి.. టూరిస్ట్ ఫ్యామిలీ యజమాని అయినా శశి కుమార్.. ఆ పెద్దామిడ చనిపోయిందని.. స్ట్రీట్ లో ఉన్న వాళ్లకు చెప్పి వాళ్లను ఆ చనిపోయిన ఇంటికి తీసుకు వెళ్తాడు. అప్పటిదాకా అసలు ఎవరితో ఎవరు మాట్లాడుకోరు. అలాంటి వారందరినీ.. ఆయన పోగేసి ఆ పెద్దావిడ అంతిమయాత్ర గ్రాండ్‌గా చేస్తాడు. ఆ సీన్ చూసినప్పుడు ఆడియన్స్‌ను హార్ట్ టచ్చింగ్ గా ఉంటుంది. రాజమౌళికి సైతం ఈ సీన్ విపరీతంగా నచ్చేసిందట. మొత్తానికి డైరెక్టర్ ఈ సినిమాతో అందరినీ ఇంప్రెస్ చేయడమే కాదు.. బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.