2 వేల మందితో తారక్ ఊర మాస్ యాక్షన్ సీక్వెన్స్.. డ్రాగన్ కోసం ప్రశాంత్ నీల్ ప్లాన్ అదిరిపోయిందిగా..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ కాంబోలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు డ్రాగన్ టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే డ్రాగన్ సినిమాపై ఆడియన్స్‌లో భారీ హైప్‌ క్రియేట్ చేస్తున్నారు టీం. ఏ చిన్న అప్డేట్ సినిమా నుంచి రిలీజ్ అయినా.. క్షణాల్లో అది తెగ ట్రెండ్ అవుతుంది. కాగా.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో రామోజీ ఫిలిం సిటీలో భారీ లెవెల్‌లో జరగనుంది.

ఓ ఊర మాస్ యాక్షన్ సీక్వెన్స్ కోసం టీం సిద్ధమవుతున్నట్లు సమాచారం. మొదట ఆర్ఎఫ్సిలో ఓ చిన్న స్కెడ్యూల్‌.. ఆ తర్వాత కర్ణాటకలో, ఇప్పుడు తాజాగా ఆర్ఎఫ్సిలో ఇలా షూటింగ్ స్కేడ్యుల్‌ ప్రకారం కొనసాగిస్తున్నారు. పీరియాడికల్‌.. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. ఎన్టీఆర్ తో పాటు.. దాదాపు 2వేల‌ మంది జూనియర్ ఆర్టిస్టులతో ఓ భారీ యాక్షన్, ఊరమాస్‌ సీక్వెన్స్ రూపొందిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు.. సినిమాల్లో స్పెషల్ సాంగ్ కోసం టాలీవుడ్ క్రేజీ బ్యూటీ కేతిక శర్మను సెలెక్ట్ చేసుకున్నారని టాక్ వైర‌ల్‌గా మారుతుంది.

NTR-Neel Film Gets New Release Date - Telugu News - IndiaGlitz.com

ఇక.. చివరిగా సింగిల్ సినిమాలో హీరోయిన్గా నటించిన ఈ అమ్మడు.. నితిన్ రావిన్ హుడ్ మూవీలో స్పెషల్ సాంగ్‌తో మెప్పించింది. ఈ క్ర‌మంలోనే సినిమాలో స్పెషల్ సాంగ్‌లో కేతిక నటిస్తుందని తెలియడంతో.. ఆడియన్స్‌లో మరింత ఆసక్తి నెలకొంది. అంతే కాదు.. కేతిక ఈ సినిమాలో నటిస్తే లైఫ్ సెట్ అయిపోయినట్టే అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.