ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేతిలో ఉన్నా.. ఒక్క సినిమాతో కూడా డార్లింగ్ థియేటర్లలో సందడి చేయడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ మూడు సినిమాల్లో నటిస్తుండగా.. వాటిలో ఒక్క సినిమా నుంచి కూడా సరైన అప్డేట్ బయటకు వచ్చిందే లేదు. రాజాసాబ్, హను రాఘవపూడి ఫౌజి, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాల్లో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టులలో సందీప్ వంగా స్పిరిట్ సినిమా ఇంకా సెట్స్ పైకే రాలేదు. అయినా ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి రోజుకో వార్త నెటింట హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు ఈ స్టోరీ లీక్ అయిందంటూ మరో న్యూస్ వైరల్ గా మారుతుంది.
ఇలాంటి క్రమంలోనే స్టోరీలో అదిరిపోయే ట్విస్ట్ ఒకటి ఉంటుందంటూ టాక్ నడుస్తుంది. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ప్రభాస్ కెరీర్‌లోనే మొట్టమొదటిసారి పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ సైతం బయటకు వచ్చాయి. డైరెక్టర్ వంగా కూడా ఈ పాత్ర గురించి ఓపెన్ కామెంట్స్ చేశారు. అయితే.. తాజాగా సినిమా ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ మరో పాత్రలో కనిపించనున్నాడని టాక్ వైరల్ గా మారుతుంది. స్పిరిట్ సెకండ్ హాఫ్‌లో ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు.. ఎమోషన్స్ సీక్వెన్స్ కూడా ఆకట్టుకొనున్నాయట.
దానికి బ్యాలెన్స్ చేసేలా సెకండ్ హాఫ్ లో ప్రభాస్ క్యారెక్టర్ పై ఓ అద్భుతమైన ఫ్లాష్ బ్యాక్ ను సందీప్ డిజైన్ చేసినట్లు సమాచారం. ఈ ఫ్లాష్ బ్యాక్ లో మాఫియా బ్యాక్ డ్రాప్ లో ప్రభాస్ క్యారెక్టర్‌ను చూపించనున్నట్లు వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇదే నిజమైతే థియేటర్లు లాస్ట్ అవడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్పిరిట్ స్టోరీ లీక్ అయిందంటూ వార్తలు వస్తున్నా నేపథ్యంలో.. ప్రభాస్ ఫ్లాష్ బ్యాక్ రోల్ కు సంబంధించిన న్యూస్ ఆడియన్స్‌లో సినిమా పై మరింత ఆసక్తిని నెలకొల్పింది. సినిమాలో ఈ మాస్ ట్విస్ట్ ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవ్వడం కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సినిమాల్లో ప్రభాస్ సరసన తృప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే.. దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా ఇచ్చాడు సందీప్.