గోల్డెన్ శారీలో సమంత గ్లామర్ హొయలు.. చీర కాస్ట్ తెలిస్తే కళ్ళుజిగేల్..!

స్టార్ బ్యూటీ సమంత దాదాపు దశాబ్ద కాలం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోయిన సంగతి తెలిసిందే. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌సన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. సౌత్ స్టార్ హీరోయిన్‌గాను మంచి సక్సెస్ అందుకుంది. కేవలం సౌత్ లోనే కాదు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. అక్కడ కూడా పలు వెబ్ సిరీస్‌లలో రాణిస్తున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే.. న‌టిగానే కాదు.. ఫ్యాషన్ ప్రపంచంలోను బలమైన బ్రాండ్ క్రియేట్ చేసుకుంది ఈ అమ్మడు. రెడ్ కార్పెట్ అయినా.. సినిమా ఈవెంట్ అయినా.. తనవైపు అందరి చూపు తిప్పుకునేలా చేయడమే సమంత స్పెషాలిటీ.

Samantha Ruth Prabhu stuns in a regal golden saree radiating grace and  luxury

ఈ క్రమంలోనే.. తాజాగా సమంత దుబాయ్‌లో జ్యువలరీ బ్రాండ్ ప్రమోషన్స్ కోసం ఓపెనింగ్స్ కు హాజరైంది. ఇందులో గోల్డెన్ శారీలో మెరిసింది. సమంత వల్ల చీరకే అందం వచ్చింది.. లుక్స్ అదరగొట్టాయి.. విశేషంగా అందరినీ మెప్పించాయి. దీనికి సంబంధించిన ఫొటోస్ ఇన్‌స్టా వేదికగా ఆమె షేర్ చేసుకుంది. గోల్డెన్ శారీలో సమంత గ్లామర్ చూసి కుర్రాళ్ళు టెంప్ట్ అయిపోతున్నారు. అమ్మ‌డి సోయగానికి దాసోహం అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సూపర్, సో బ్యూటిఫుల్, సో హాట్ అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సమంత ధరించిన ఈ చీర కాస్ట్ కూడా హాట్ టాపిక్ గా మారింది.

Samantha Ruth Prabhu stuns in a regal golden saree radiating grace and  luxury

ప్రస్తుతం ఈ చీర ధర తెలిసి అంత ఆశ్చర్యపోతున్నారు. ప్రముఖ డిజైనర్ క్రేషా బజాజ్ రూపొందించిన ఈ చీర ధర.. అక్షరాల రూ.3.95 లక్షలు అని తెలిసి అంతా షాక్ అవుతున్నారు. సమంత రేంజ్‌కు ఈ చీర కాస్ట్ తక్కువ అయినా.. సాధారణ జనానికి మాత్రం ఒక్క చీరకు ఇంత కాస్ట్ అంటే కచ్చితంగా కళ్ళు జిగేలురాల్సిందే.. ఇక ఇటీవల సమంత ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ అమ్మడు తెర‌కెక్కించిన‌ మొదటి మూవీ శుభం. బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది. ఇక అమ్మడు.. రక్త బ్రహ్మాండ్‌ ది బ్లడ్ కింగ్డమ్ సిరీస్‌తో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు. సొంత బ్యానర్‌లో మా ఇంటి బంగారం అనే మరో సినిమాలో సమంత నటిస్తుంది.