రాజ్ తో సమంత డేటింగ్.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే..?

సౌత్ స్టార్ బ్యూటీ సమంత.. సినీ ఇండస్ట్రీలో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. సినిమాల్లో యాక్టివ్‌గా లేకపోయినా.. వెబ్ సిరీస్‌లో నటిస్తూ నిర్మాతగాను రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్తలో అమ్మడు వైరల్ అవుతూనే ఉంది. కాగా సమంత సినీ లైఫ్ కంటే ఎక్కువగా పర్సనల్ లైఫ్ కు సంబంధించిన వార్త‌ల‌తోనే వైరల్ అవుతూ ఉంటుంది. ఈ క్ర‌మంలోనే.. ది ఫ్యామిలీ మెన్ డైరెక్టర్ రాజ్ నిడ‌మోరుతో స‌మంత ల‌వ్‌లో ఉందని.. డేటింగ్ చేస్తుందని.. త్వరలో వీళ్లిద్దరు వివాహం చేసుకోబోతున్నారంటూ రకరకాల వార్తలు టాలీవుడ్, బాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే రాజ్ నిడ‌మోరుకు గతంలోనే వివాహం జరిగింది.

All about rumoured couple Samantha and Raj Nidimoru - IBTimes India

ఆమెతో ఇంకా రాజ్‌కు విడాకులు కాలేదు. 2015లో పలు బాలీవుడ్ సినిమాలకు రైటింగ్ అండ్ డైరెక్షన్ టీంలో పనిచేసిన.. శ్యామలీ డేను రాజ్ నిడమూరు వివాహం చేసుకున్నారు. అయితే.. ఇప్పుడు ఈ జంట విడాకులు తీసుకోనున్నారట. ఈ క్రమంలోనే.. రాజ్, సమంత.. ప్రస్తుతం సైలెంట్ గా లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని.. ఒక్కసారి వీళ్ళిద్దరికీ అఫీషియల్‌గా విడాకులు వచ్చేస్తే.. వెంటనే సమంతతో రాజ్ నిడమోరు.. ఏడు అడుగులు వేస్తాడంటూ వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. దానికి తగ్గట్లుగానే సమంత రోజురోజుకు రాజ్‌తో ఉన్న క్లోజెస్ట్ మూమెంట్స్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. దీంతో.. ఈ డేటింగ్ వార్తలకు మరింత ఊతం ఇచ్చినట్లు అవుతుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు సమంతకాని.. అటు రాజ్ నిడమోరు ఈ రిలేషన్ వార్తలపై స్పందించలేదు.

కాగా.. రాజ్ నిబ‌మోరు భార్య.. శ్యామలి డే మాత్రం రకరకాల కొటేషన్లు, క్యాప్షన్‌లతో ఎప్పటికప్పుడు.. తన కోపాన్ని, ఆవేశాన్ని సోషల్ మీడియా వేదికగా రివీల్ చేస్తూ వస్తుంది. ఈ పరిణామాలను చూస్తుంటే.. త్వరలోనే రాజ్, శ్యామ‌లి డివోర్స్ తీసుకోనున్నార‌ని.. సమంత, రాజ్ వివాహం కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే సమంత, రాజ్ మధ్య ఏజ్ గ్యాప్ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం రాజ్ నిడ‌మోరు వయసు 45 సంవత్సరాలు. కాగా.. సమంతకు 38 సంవత్సరాలు. అలా వీళ్ళిద్దరి మధ్యన దాదాపు 7 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉందట. ప్రస్తుతం వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ తెలిసి అంత షాక్ అవుతున్నారు. కాగా ఇప్పటికే.. ఏజ్‌తో లవ్‌కు సంబంధం ఉండ‌దని ఎంతో మంది కపుల్స్ రుజువు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజ్, సమంత కూడా ఈ లిస్ట్‌లో చేరతారేమో వేచి చూడాలి.