టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ తమ్ముడుగా ఎంట్రీ ఇచ్చి తన కంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలోనే తను నటించిన అతి తక్కువ సినిమాలతోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుని.. పవర్ స్టార్ ఇమేజ్‌తో రాణిస్తున్నాడు. ఇక పవన్ నుంచి ఒక సినిమా వస్తుందంటే.. సినిమా ఫస్ట్ డే, ఫస్ట్ షో థియేటర్ల వద్ద అభిమానుల రచ్చ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాక్ ఎలా ఉన్నా.. మినిమం కలెక్షన్స్ రికవరీ అవుతాయి అనడంలో అతిశయోక్తి లేదు.
ఇలా ఇండస్ట్రీలో మంచి ఇమేజ్తో దూసుకుపోతున్న పవన్ రాజకీయాల్లోనూ అడుగు పెట్టి సంచలన సక్పస్‌తో ఏపీ డిప్యూటీ సీఎం గా పగ్గాలు చేపట్టి బిజీ బిజీగా గడుపుతున్నాడు. అయినా పవన్ సినిమాలను మాత్రం వదలలేదు. తాను సైన్ చేసిన సినిమాల షూట్స్‌ను వేగంగా పూర్తి చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనేఇప్పటికే పవన్ హరిహర వీరమల్లు షూట్‌ను పూర్తి చేసాడు. ఈ నెల 12న ఆల్ ఇండియా లెవెల్‌లో ఈ మూవీ గ్రాండ్గా రిలీజ్ కానుంది. పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత.. మొదటిసారి రిలీజ్ కానున్న సినిమా కావడంతో.. సినిమా పై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.
ఇక ఈ సినిమా రిలీజై కేవలం పది రోజులు సమయం మాత్రమే ఉన్న క్రమంలో.. ప్రమోషన్స్ కూడా మరింత వేగవంతం చేసారు టీం. ఇదిలా ఉంటే.. పవన్ అభిమానులు కూడా ఈ సినిమాను ప్రమోట్ చేసే పనిలో తెగ బిజీ అయిపోతున్నారు. సోషల్ మీడియాలో పవన్ అభిమానులు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను టార్గెట్ చేసుకొని గతంలో పవన్ కళ్యాణ్ పై రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించిన వీడియోను వైరల్ చేస్తూ.. రాజమౌళితో నువ్వు మూడు సినిమాలు చేశావ్.. ఎప్పుడైనా ఈ రేంజ్ లో ప్రశంసలు వచ్చాయా తారక్ అంటూ తెగ ట్రోల్స్ చేసేస్తున్నారు. ఇక పవన్ హీరోగా నటించిన ఓ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమానికి హాజరైన రాజమౌళి.. పవన్ గురించి మాట్లాడుతూ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు.
SSR tho 3 film’s cheshavu @tarak9999 a roju aina ni fan following gurinchi matladada 🤣
BOLLYWOOD nundi MALLUWOOD varaku a Celebritini adiga cheptharu AP/TS lo
Craze ka Baap @PawanKalyan ani 🥵 pic.twitter.com/iuY8T65kpe
— TenTen_ 🚩 (@praveenprem04) June 1, 2025