‘ ప్రేమదేశం ‘ హీరో వినీత్ ఆ స్టార్ హీరోయిన్ కు తమ్ముడా.. అసలు గెస్ చేయలేరు..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ న‌టుడు వినీత్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రేమదేశం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈయన.. తన హెయిర్ స్టైల్, నటనతో.. యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు వినీత్. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లో జెంటిల్మెన్ , సరిగమలు, వైఫ్ ఆఫ్ వి. వరప్రసాద్, నీ ప్రేమకై, రుక్మిణి, లాహిరి లాహిరి లాహిరిలో, చంద్రముఖి తదితర సినిమాలో నటించి మెప్పించాడు. అయితే.. గతంలోలా ఇప్పుడు వినీత్‌.. పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదన్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు మాత్రమే సహాయ నటుడిగా పలు సినిమాల్లో తళ్లుకున్న‌ మెరుస్తున్నాడు.

Prema Desam (1996) (1996) - Movie | Reviews, Cast & Release Date in  hyderabad- BookMyShow

గతేడాది మనోరతంగల్ అనే మల్టీ స్టారర్ వెబ్ సిరీస్‌లో.. ఓ కీలక పాత్రలో కనిపించిన వినీత్.. ఈ సినిమాలతో పాటు అప్పుడప్పుడు డ్యాన్స్ కచేరీలను సందడి చేస్తూ ఉంటాడు. వినీత్‌కు క్లాసికల్ డ్యాన్స్ పై మంచి పట్టు ఉంది. ఈ క్రమంలోనే డాన్స్ స్టేజ్‌పై కూడా ఈయన తన పర్ఫామెన్స్ ఆకట్టుకుంటూ ఉంటాడు. ఇదలా ఉంటే.. వినీత్ టాలీవుడ్ లో ఓ స్టార్ హీరోయిన్ కు కజిన్ బ్రదర్ అన్న సంగతి చాలామందికి తెలియదు. అంతేకాదు.. ఆమె కూడా ఓ మంచి క్లాసికల్ డ్యాన్సర్.

Shobana Poses With Her Relative And Actor Vineeth; Photos Goes Viral -  Malayalam Filmibeat

టాలీవుడ్ లో ఇప్పటికీ పలు సినిమాల్లో రాణిస్తున్న ఈ సీనియర్ ముద్దుగుమ్మ.. మరెవరు కాదు శోభన. 90ల్లో ఇండస్ట్రీలో ఈమెకు ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి చెప్పనవసరం లేదు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ అని భాషలతో సంబంధం లేకుండా.. 230కి పైగా సినిమాల్లో నటించే ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. కేవలం హీరోయిన్ గానే కాదు.. పలు సినిమాలో డాన్సర్‌గా, కొరియోగ్రాఫర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను మెరిసి.. మల్టీ టాలెంటెడ్ ఉమెన్‌గా సత్తా చాటుకుంటుంది. ఇటీవల తన నటనకు గుర్తుగా.. పద్మభూషణ్‌ అవార్డున సైతం దక్కించుకుంది శోభన.