టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపీ డిప్యూటీ సీఎం.. పవన్ కళ్యాణ్ చిన్న తనయుడు మార్క్ శంకర్‌కు ప్రేక్షకులలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే.. మార్క్ శంకర్.. సింగపూర్ స్కూల్‌లో తన ఎడ్యుకేషన్‌ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం మార్క్ స్కూల్లో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. అప్పట్లో.. ఈ వార్త సంచలనంగా మారింది. మార్క్‌కు హాస్పిటల్ లో కొద్దిరోజులపాటు ట్రీట్మెంట్ తర్వాత.. గాయాలు నయమై, ఆరోగ్యం కుదురు పడిన వెంటనే.. తనను తీసుకుని ఇండియాకు వచ్చేసారు పవన్ దంపతులు. కాగా.. నిన్న మొన్నటి వరకు ఇంటర్నేషనల్ లెవెల్ ఎడ్యుకేషన్ అవసరమని.. సింగపూర్ స్కూల్లో చదివించేందుకు ఫిక్స్ అయిన పవన్.. తాజాగా తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తుంది.
ఇకపై ఇండియాలోనే తన పిల్లలను చదివించాలని ఫిక్స్ అయిన పవన్.. ఇందులో భాగంగానే శుక్రవారం.. తన తనయుడు మార్క్ శంకరును తీసుకుని పటాన్ చెరువు సమీపంలోని.. ఇక్రాసాట్‌లో ఉన్న.. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్‌లో అడ్మిషన్ తీసుకునేందుకు వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ స్వయంగా ఆ స్కూల్ కి వెళ్లి.. పాఠశాల యాజమాన్యంతో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఏర్పడిన.. మొట్టమొదటి ఇంటర్నేషనల్ స్కూల్ ఇది. ఈ హై స్కూల్.. హైదరాబాద్ సిటీకి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. పచ్చదనం, భద్రత, ప్రకృతి వాతావరణం, సుందరమైన పాఠశాల ఎన్విరాన్మెంట్.. విదేశీ విద్యార్థులు, అలాగే ఇంటర్నేషనల్ లెవెల్ ఎడ్యుకేషన్ కొనసాగించాలనుకునే ఇండియన్ విద్యార్థుల కోసం.. ప్రత్యేకంగా ఈ పాఠశాలను రూపొందించారు. ఎలిమెంటరీ నుంచి గ్రేడ్ 12 వరకు ఇక్కడే పూర్తిస్థాయిలో చదువు అందిస్తారు. అది కూడా ఇంటర్నేషనల్ లెవెల్ లెసన్స్ మాత్రమే బోధిస్తారు. అలా.. ఈ స్కూల్‌లో 400 మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు. ఎవరికి పడితే వాళ్లకు స్కూల్లో అడ్మిషన్ కూడా సాధ్యం కాదు. అంతేకాదు.. ఈ విద్యార్థుల్లో సగానికి పైగా మంది.. విదేశాల నుంచి వచ్చిన వారే కావడం విశేషం.
స్కూల్లో సిబ్బంది కూడా 35% ఫారెన్ దేశాల నుంచి వచ్చిన వాళ్లే ఉంటారు. కాబట్టి.. బట్టి కొట్టించడం.. పరీక్షలు, మార్కులు అంటూ షంటడం లాంటిది ఇక్కడ ఉండవు. ప్రతి ఒక్క కాన్సెప్ట్ పిల్లలకు అర్థమయ్యే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ.. చదువును బోధిస్తారు. ఒక్క తరగతికి 15 నుంచి 20 మంది విద్యార్థులు మాత్రమే ఉండడంతో.. వ్యక్తిగత శ్రద్ధతో గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఈ స్కూల్లో చదువుకున్న ప్రతి విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి వస్తాయి. ఇక్కడ చదువుకున్న తర్వాత నేరుగా ఫారిన్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుందట. మహేష్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల కిడ్స్ సైతం.. ఈ హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్లోనే తమ చదువును పూర్తి చేస్తున్నారు. ఇక ఈ స్కూల్ ఫీజులు తెలిస్తే ఖచ్చితంగా దిమ్మతిరిగిపోతుంది. కేవలం అడ్మిషన్ కే ఏకంగా రూ.8 నుంచి రూ.12 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందట. ఏడాదికి స్కూల్ ఫీజు.. ఇతర ఖర్చులు కలిపి.. దాదాపు రూ.15 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు.