నితిన్ తమ్ముడు ఫస్ట్ రివ్యూ.. సినీ హిస్టరీలో ఇప్పటివరకు లేని క్రేజీ క్లైమాక్స్..!

టాలీవుడ్ క్రేజీ హీరో నితిన్.. రాబిన్ హుడ్ లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత.. తమ్ముడు సినిమాతో ఆడియన్స్ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈసారి సినిమాతో కచ్చితంగా సూపర్ హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు నితిన్. లేదంటే కెరీర్ మొత్తం డేంజ‌ర్‌లో పడిపోతుంది. అందుకే.. ఆయన ఇకపై స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. షూట్‌ను కూడా.. మొదలుపెట్టి సమాంతరంగా డేట్స్ ఇస్తూ వచ్చాడు నితిన్. రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అంతేకాదు నితిన్ ఇప్పటివరకు లేని సరికొత్త కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడట‌. ఈ క్రమంలోనే ప్రేక్షకుల్లో సైతం ఆసక్తి నెలకొంది. ఇక తాజాగా.. సినిమా ఫస్ట్ ప్రింట్ కూడా సిద్ధమయింది.

Thammudu 2025 | Thammudu Telugu Movie: Release Date, Cast, Story, Ott,  Review, Trailer, Photos, Videos, Box Office Collection – Filmibeat

దీనిని ప్రివ్యూ షో హైదరాబాద్‌లో ప్రసాద్ ల్యాబ్స్‌లో కొంతమంది బయ్యర్స్ వీక్షించారు. వాళ్ళ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందట. ఇక మూవీ ఓ పాయింట్ నుంచి స్టోరీ ప్రారంభమై.. హీరో ఊర్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి.. కథ తీసుకున్న మలుపుల‌కు స్క్రీన్ ప్లే.. విధానం చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తాయని.. కచ్చితంగా ఈ సినిమా నితిన్ కెరీర్‌లో స్ట్రాంగ్ కం బ్యాక్ అవుతుందంటూ.. సినిమా చూసిన బ‌య‌ర్స్ త‌మ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ నడుస్తుంది. ముఖ్యంగా.. సెకండ్ హాఫ్‌లో కొన్ని క్యారెక్టర్లు ఇచ్చే ట్విస్ట్‌లకు.. ఆడియన్స్ దిమ్మ‌తిరిగిపోతుందని.. వేణు శ్రీ రామ్‌లో ఇంత టాలెంట్ ఉందా అని ఆశ్చర్య పోవడం ఖాయం అని చెబుతున్నారు.

Nithiin's Thammudu hits a roadblock?

ఇక చాలా కాలం నుంచి ఒక్క సరైన సూపర్ హిట్ కూడా లేక విలవిలలాడుతున్న టాలీవుడ్ బాక్సాఫీస్ కు.. తమ్ముడు సినిమా కొత్త ఊపిరిని ఇస్తుందంటూ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇక.. ఇటీవల కాలంలో నితిన్‌ నుంచి రిలీజ్ అయిన సినిమాలు ఫస్ట్ రివ్యూ తోనే ఈరోజు పాజిటివ్ రెస్పాన్స్ ద‌క్కించుకోవడం ఇదే మొదటిసారి. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయిన తర్వాత.. సినిమా పూర్తి వివరాలు రివీల్ అవ‌డ‌వుతాయి. ఇదిలా ఉంటే.. క్లైమాక్స్ సీన్స్ ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీ హిస్టరీలోనే లేని విధంగా ఓ క్రేజీ ముగింపుతో తీర్చిదిద్దాడని.. డైరెక్టర్ ఆలోచన విధానం అదిరిపోయిందంటూ స‌మాచారం. ఇంతకీ వేణు శ్రీరామ్ ఏం ప్లాన్ చేశాడో వేచి చూడాలి.