టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ప్రొడక్షన్ బ్యానర్ పై మంచు విష్ణు హీరోగా తెరకెక్కనున్న తాజా మూవీ కన్నప్ప గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బాక్సాఫీస్ దగ్గర ఈ నెల రిలీజ్ కానున్న సినిమాల్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అయిన కనప్పకు ఆడియన్స్ లో ఊహించిన హైప్ మాత్రం లేదు. ఎంతో కొంత క్రేజ్ ఉందంటే దీనికి ప్రధాన కారణం రెబల్ స్టార్ ప్రభాస్ అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమాలో ప్రభాస్ ఓ చిన్న పాత్రలో నటించనున్నాడు. ఇక ఈ సినిమా ఈ నెల 27న గ్రాండ్ లెవెల్ లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమాకు సంబంధించిన హార్ట్ డ్రైవ్ ఈష్యు నెటింట దుమారం రేపింది.
ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ వైరల్ అవుతూనే ఉన్న సంగతి తెలిసిందే. రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకు సంభందించిన రోజుకో వార్త సినీ సర్కిల్స్‌లో తెగ వైరల్ గా మారుతుంది. తాజాగా.. సినిమా రన్ టైం పై కొత్త వార్త జోరందుకుంది.. ఏకంగా సినిమా ఫుల్ రన్ టైం 3 గంటల 12 నిమిషాలు ఉండబోతుందని టాక్ నడుస్తోంది. ఓ మైథాలజికల్ కధకు.. మరీ ఈ రేంజ్‌లో రన్ టైం.. ప్రస్తుత పరిస్థితుల్లో అసలు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనే సందేహాలు సినీ సర్కిల్స్‌లో ప్రారంభమయ్యాయి.
కేవలం ప్రభాస్ ఉన్నాడని తప్పించి సినిమాపై ఊహించిన రేంజ్ లో బజ్ లేదు. ఇలాంటి క్రమంలో సినిమాకు ఈ రేంజ్ రన్ టైం.. అసలు కలిసి వస్తుందా.. లేదా.. అనే సందేహాలు మొదలయ్యాయి. మరి ఈ వార్తలపై మూవీ యూనిట్ ఎలా రియాక్ట్ అవుతారు.. నిజంగా కన్నప్ప సినిమా ఇంత లెంగ్థీ రన్ టైం ఉంటుందా.. లేదా.. తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. సినిమాలో ప్రభాస్, అక్షయకుమార్, మోహన్ బాబు, మోహన్‌లాల్, కాజల్ తదితరులు కీలకపాత్రలో మెరువనున్నారు.