టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాంటి క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా రాజకీయాల్లో బిజీగా గడుపుతూనే.. మరో పక్క సినిమా షూట్లలో సందడి చేస్తున్నాడు. అలా దాదాపు 5 ఏళ్లు సెట్స్‌పై ఉన్న హరిహర వీరమల్లు సినిమాను ఇటీవల పూర్తి చేసిన సంగతి తెలిసిందే. మొదట జూన్ 12న సినిమా రిలీజ్ అవుతుంది అంటూ అఫీషియల్‌గా ప్రకటించినా విఎఫ్ఎక్స్ కారణాలతో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. అయితే.. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు టీం. పవన్‌కే కాదు మెగా హీరోలు అందరికీ బాగా కలిసొచ్చిన జూలై నెలలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయ్యారు. అది కూడా ఇప్పటికే పవన్ బ్లాక్ బస్టర్ అందుకున్న జులై 24 ను ఫిక్స్ చేయడం ఫ్యాన్స్‌కు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుంది.
ఈ సినిమాతో కచ్చితంగా పవన్ బ్లాక్ బస్టర్ కొట్టడం కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఇప్పటివరకు జులైలో రిలీజై బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా హీరోల సినిమాలో ఏంటో ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా జులై 24న రిలీజై బ్లాక్ బస్టర్ అందుకుంది. అదే నెలలో సుస్వాగతం, గోకులంలో సీత, తమ్ముడు సినిమాలు సైతం రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అంతేకాదు పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ కలిసి నటించిన బ్రో సినిమా కూడా జూలైలోనే రిలీజ్ అయింది. ఈ సినిమా హిట్ అందుకోకపోయినా మెగా అభిమానుల ఆదరణ పొందింది. ఇక పవన్ అన్న మెగాస్టార్ చిరంజీవి కూడా జూలై 24న ఇంద్ర సినిమాతో ఆడియన్స్ ని పలకరించారు. ఫ్యాక్షన్ సినిమాలు తెలుగులో వరుస బ్లాక్ బాస్టర్లు అందుకుంటున్న టైంలో.. మెసేజ్ ఓరియంటెడ్ ఫ్యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఇంద్ర సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
అలాగే.. చిరు తనయడు ఫస్ట్ మూవీ చిరుత సినిమా కూడా జూలైలోనే రిలీజ్ అయింది. మగధీర సినిమా కూడా జూలైలోనే వచ్చి అప్పట్లో ఇండస్ట్రియల్ హిట్‌గా నిలిచింది. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఫిదా మూవీ జూలై 21న రిలీజ్ అయ్యా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో తెలిసిందే. అంతే కాదు చిరంజీవి కథలో శంకర్ దాదా జిందాబాద్ కూడా జులై 27న రిలీజై హిట్ కొట్టింది. ఇలా చెప్పుకుంటూ పోతే మెగా హీరోలు నటించిన ఎన్నో సినిమాలు జూలైలో రిలీజ్ అయ్యి మంచి రిజల్ట్ లో అందుకున్నాయి. ఇక పవన్ వీరమల్లుకు ఈ బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ ఏ రేంజ్లో వర్కౌట్ అవుతుందో చూడాలి.