” కన్నప్ప ” బ్రాహ్మణ వివాదం.. కంచిపరచడానికి ఎవరు కోట్లు ఖర్చు పెట్టరంటూ రైటర్ ” ఆకెళ్ళ “..!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప పై ఇప్పటికే ఎన్నో వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. వాటిలో ప్ర‌ధాన‌మైన‌ది.. బ్రాహ్మణ సంఘం అభ్యంతరాలు తెలుపడం. ఈ సినిమాలో రెండు క్యారెక్టర్లు పేర్లు పిల‌క‌, గిలక బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసేయని.. ఆ పేర్లను తొలగించుకుంటే మూవీని అడ్డుకుంటామంటూ బ్రాహ్మణ సంఘాలు వార్నింగ్ ఇచ్చాయి. అయితే.. తాజాగా ఈ అంశంపై కన్నప్ప‌ రైటర్ ఆకెళ్ళ శివప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. కన్నప్ప సినిమాపై జరుగుతున్న దుష్ప్రచారం నాకు ఆవేదన కలిగిస్తుందని.. ఆకెళ్ళ పేర్కొన్నాడు.

కన్నప్ప' మూవీపై బ్రాహ్మణుల అభ్యంతరం - డైలాగ్ రైటర్ 'ఆకెళ్ల' క్లారిటీ.. మూవీ  చూసిన తర్వాతే.. kannappa writer akella siva prasad clarifies about  controversy on brahmin names issue in ...

ఈ మేరకు ప్రకటన రిలీజ్ చేస్తూ.. సినిమాకు మాటల రచయితగా పనిచేసిన నాకు ఈ దుష్ప్రచారం చాలా ఆవేదనను కలిగించిందని.. డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్, నేను ఇద్ద‌రం బ్రాహ్మణులమే.. సినిమాలో బ్రాహ్మణులని కానీ.. ఏ కులాన్ని కానీ.. ఎవ‌రం కించపరచలేదు. ఇది వరకు వచ్చిన శ్రీకాళహస్తి మహత్యం, భక్త కన్నప్ప సినిమాల్లో గుడి ప్రధాన పూజారి మహ‌దేవ శాస్త్రి పాత్రను గుడిలో దేవుని నగలు తీసుకెళ్లి వేరే వాళ్లకు ఇచ్చినట్లు చూపించారు. కానీ.. మంచు విష్ణు గారు ఈ పాత్రను.. ఆ రోజులు కూడా మహా శివ భక్తుడిగా చాలా ఉన్నతంగా చూపించారు. రేపు సినిమా చూశాక ఈ విషయం అందరికీ తెలుస్తుంది అంటూ క్లారిటీ ఇచ్చారు.

మూవీ స్టోరీ రాస్తున్నప్పుడే కాదు.. పూర్తి చేశాక కూడా శ్రీకాళహస్తి దేవస్థానం ప్రధాన అర్చకులకు కథ చూపించాం.. చాలా ఉన్నతంగా ఉందని ప్రశంసించడమే కాదు.. మోహన్ బాబు, విష్ణులను వేదమంత్రాలతో ఆయన ఆశీర్వదించారు. పాటలు రాసిన రామజోగ్గ‌య శాస్త్రి గారితో సహా ఎందరో బ్రాహ్మణులు.. వివిధ శాఖల్లో ఈ సినిమా కోసం పనిచేశారు. ఏ వర్గాన్ని కించపరచడానికి కోట్లు ఖర్చుపెట్టి ఎవరు సినిమా తీయరు.. కన్న‌ప్ప రిలీజ్ కాకుండానే ఏవేవో రూమర్లు పుట్టించి దుష్ప్రచారాలు చేస్తున్న వారి సంగతి కూడా పరమేశ్వరుడు చూసుకుంటాడు అంటూ ఆకెళ్ళ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఆకెళ్ళ‌ చేసిన కామెంట్స్ నెటింట వైరల్ గా మారుతున్నాయి.