నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, చప్పట్లు కొట్టిస్తుంది.. లేటెస్ట్ మూవీ పై మహేష్ క్రేజీ రివ్యూ..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో సందర్భాల్లో తనకు నచ్చిన సినిమాల విషయంలో సోషల్ మీడియా వేదికగా ఎన్నో సార్లు రివ్యూ పంచుకుంటూ వ‌చ్చాడు. అలా.. తాజాగా ఓ సినిమాపై ఇంట్రెస్టింగ్ రివ్యూను షేర్ చేసుకున్నాడు మ‌హేష్‌. ఈ సినిమా నవ్విస్తూ.. ఏడిపిస్తూ.. ఆడియోస్ తో చప్పట్లు కొట్టించుకుంటుందని.. కచ్చితంగా అందరిని ఆకట్టుకుంటుందంటూ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం మహేష్ బాబు ఇచ్చిన ఈ రివ్యూ నెటింట వైరల్‌గా మారుతుంది. ఇంతకీ ఆ మవీ ఏదో కాదు.. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తాజాగా న‌టించిన సితారే జమీనే పర్.

Sitaare Zameen Par': First look of Aamir Khan's next out; film also gets a  release date - The Hindu

ఈ మూవీలో జ‌నీలియా హీరోయిన్‌గా మెరిసింది. గతంలో అమీర్‌ హీరోగా.. స్వీయ‌ డైరెక్షన్లో.. ప్రొడ్యూసర్ గా వ్యవహరించి బ్లాక్ బాస్టర్ కొట్టిన‌.. తారే జమీన్ పర్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందింది. ఇక జూన్ 20న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అయ్యిన ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. తాజాగా.. ఈ సినిమాకు మహేష్ రివ్యూ ఇచ్చారు. ప్రస్తుతం మహేష్ ఇచ్చిన ఈ రివ్యూ తెగ వైరల్‌గా మారుతుంది. సితారే జమీనా పర్ అందరి మనసులు దోచుకుంటుందని.. ఈ మూవీ ఆడియన్స్‌ను నవ్విస్తుంది.. ఏడిపిస్తుంది.. అలాగే వారితో చప్పట్లు కొట్టిస్తుందంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

BOB about Sitaare Zameen Par. Forget Top stars, even those who are giving  out flops after flops doing the so called commercial movies wouldn't act in  a movie like this. This and

సినిమా చూశాక.. కచ్చితంగా ఆడియన్స్ చిరునవ్వుతో బయటకు వస్తారంటూ పేర్కొన్నాడు. సితారే జమీన్ పర్ ఆర్ఎస్ ప్రసన్నా దర్శకత్వంలో సినిమా అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై.. అమీర్‌ఖాన్, అపర్ణ పురోహి సంయుక్తంగా తెర‌కెక్కించారు. ఈ సినిమాలో ఆరోహి దత్త, గోపికృష్ణ, వేదాంత్ వర్మ, సింధు దేవై, ఆయుష్ బన్సాలి, ఆశిష్ షిండే, రిషి షహీన్, రిషబ్ జాయిన్, నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్ ఇలా పలువురు స్టార్ కాస్టింగ్ నటించి ఆకట్టుకున్నారు.