స్టార్ బ్యూటీ జెనీలియాకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ఎలాంటి క్రేజ్, పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బొమ్మరిల్లుతో.. హహ.. హ.. హాసిని అంటూ తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయినా ఈ ముద్దుగుమ్మ.. సై, నా అల్లుడు, హ్యాపీ డేస్, ఆరెంజ్ ఇలా ఎన్నో సినిమాల్లో తన నటనతో మెప్పించింది. లక్షల మంది ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. ఇందులో కొన్ని సినిమాలు ఇతర భాషల రీమేక్ కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి. అలాంటి వాటిలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన రెడీ మూవీ ఒకటి. ఈ మూవీని బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌తో రీమేక్ చేశారు. హీరోయిన్గా జెనీలియా బదులు అసిన్ నటించింది. అయితే.. అప్పట్లో సల్మాన్ జెనీలియాను రిజెక్ట్ చేయడంతోనే.. అసిన్ ఈ సినిమాలో నటించిందంటూ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.
కాగా ప్రస్తుతం జెనీలియా నటించిన సితారే జమీనేపర్ మూవీ ప్రమోషన్స్‌లో ఇదే ప్రశ్న జెనీలియాకు ఎదురయింది. రెడీ హిందీ రీమిక్స్‌లో మిమ్మల్ని తీసుకోలేదని.. మీరు బాధపడ్డారా అని ఇంటర్వ్యూవర్ ప్రశ్నించాడు. దానికి హీరోయిన్ అసలు అలాంటిదేమీ లేదు.. నన్ను సంప్రదించి ఉంటే సంతోషంగా యాక్సెప్ట్ చేసేదాన్ని.. ఎందుకంటే అది నా మూవీ అయినా.. ఆ అవకాశం పోయిందంటే సల్మాన్ తో నటించేందుకు మరో మూవీ నాకోసం ఎదురు చూస్తుందేమో అంటూ కామెంట్స్ చేసింది. తర్వాత.. యాంకర్ సౌత్ నుంచి మంచి పాత్రను దక్కలేదు కదా అని ప్రశ్నిస్తుండగా.. జెనీలియా మధ్యలో అడ్డుకొని అసలు కానే కాదు అంటూ మాట్లాడింది. సౌత్ లో నాకు ఎప్పుడూ మంచి అవకాశాలే వచ్చాయి. నా సినిమాలు చూస్తే సౌత్లో నాకు ఎంత అద్భుతమైన పాత్రలు వచ్చాయో అర్థం అవుతుంది.. అక్కడ ఎంతో నేర్చుకున్నా అంటూ వివరించింది.
నాకు మంచి సినిమాలు.. మంచి అవకాశాలు ఇచ్చారు. అందుకు నేను ఎప్పటికీ సౌత్ ఇండస్ట్రీకి రుణపడి ఉంటా. మీరు ఈరోజు హైదరాబాద్‌కు వెళ్ళిన సరే.. బొమ్మరిల్లు జెనీలియా రోల్ అనగానే హాసిని అంటూ వెంటనే చెప్పేస్తారు. ఇక తమిళ్లో హరిణి (సంతోష సుబ్రహ్మణ్యం) మలయాళం లో ఆయేషా (ఊరుమి) ఈ పేర్లతో నన్ను ఇప్పటికీ పిలుస్తూనే ఉంటారు. అలాంటి పాత్రలు దక్కడం నా అదృష్టంగా భావిస్తున్న అంటూ జెనీలియా సమాధానమిచ్చింది. శంకర్, రాజమౌళి లాంటి టాప్ డైరెక్టర్లతోనే కాదు.. కొత్త డైరెక్టర్లతోనూ నేను పని చేశాను అని మొత్తం సైకిల్‌ను నేను చాలా ఎంజాయ్ చేశాను. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారడంతో.. యాంకర్ అడిగిన తిక్క ప్రశ్నకు సౌత్ ఇండస్ట్రీ పై విషంకక్కాలని చూస్తున్న ఆ యాంకర్ ..కు జెనీలియా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిందని.. సరిగ్గా బుద్ధి చెప్పిందంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.