టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్‌గా కన్నప్ప రూపొందిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు, విష్ణు సంయుక్తంగా ప్రొడ్యూసర్లుగా వ్యవహరించిన ఈ సినిమా పైనే మంచి విష్ణు పూర్తి ఆశలన్నీ పెట్టుకున్నారు. ఈ సినిమా ఎలాగైనా బ్లాక్ బస్టర్ అవుతుందని స్ట్రాంగ్ సక్సెస్ అందుకుంటుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా.. మొదట ఈ ప్రాజెక్టును తనికెళ్ల భరణి చేయాలనుకున్న సంగతి తెలిసిందే. ఏదేమైన చివరకు ఈ ప్రాజెక్టును మంచు విష్ణు తన సొంతం చేసుకున్నారు. ఇక త్వరలోనే.. ఈ సినిమా ఆడియన్స్ పలకరించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంచు మోహన్ బాబు, విష్ణు ఇద్దరు సినిమా ప్రమోషన్స్ లో బిజీ అయిపోయారు.
తమ సినిమాలో ఇప్పటి వరకు కన్నప్ప గురించి రివిల్ చేయని ఒక కొత్త విషయాన్ని చూడబోతున్నారంటూ సినిమాపై ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంటున్నారు. కాగా.. కన్నప్ప ఫుల్ షూట్ ను న్యూజిలాండ్ లోనే ముగించిన సంగతి తెలిసిందే. ఎందుకు న్యూజిలాండ్ లో మాత్రమే కన్నప్ప షూట్ ను ముగించారు అన్న సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. ఇక ఇప్పటివరకు దానిపై క్లారిటీ లేకున్నా.. తాజాగా మంచు విష్ణు, మోహన్ బాబు కలిసి షేర్ చేసుకున్న ఓ వీడియోతో వీటిపై క్లారిటీ వచ్చింది. థిస్ ఇస్ మా ప్రాపర్టీ అంటూ.. న్యూజిలాండ్ లో భవంతిని చూపిస్తూ అనౌన్స్ చేసిన ఈ తండ్రి కొడుకులు.. ఇదంతా 7 ఎకరాల మంచు విష్ణు బాబు ప్రాపర్టీ అని.. ఇన్కమ్ టాక్స్ వాళ్ళు వింటున్నారా..? విన్న అసలు భయం లేదు.. నో బ్లాక్ మనీ.
న్యూజిలాండ్‌లో వనకాల అనే ప్రాంతంలో విష్ణువర్ధన్ ఈ ఏడు వేల ఎకరాలు కొన్నాడు. ఇదంతా మనదే అంటూ ఆనందోత్సాహంతో మోహన్ బాబు ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు. కన్నప్ప షూటింగ్ టైంలో తన పుట్టినరోజు వేడుక, పెళ్లిరోజు వేడుకలను కూడా ఇక్కడే జరుపుకున్నాడని.. తన భార్య పిల్లలతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తన సొంత ప్రాపర్టీ లోనే కన్నప్ప షూట్‌ను గ్రాండ్‌గా చేశారని చెప్పకనే చెప్పేశారు. కన్నప్ప సినిమా జూన్ 27న రిలీజ్ కానుంది. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా సెలెక్ట్ అయిన తర్వాత.. నటినటుల కోసం ఒక బిల్డింగ్ తన డబ్బుతో నిర్మిస్తానని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. మరి ముందు ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి.