టాలీవుడ్ పవర్ స్టార్, ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. రెండో భార్య రేణు దేశాయ్ మూడో భార్య అన్నా లెజ్నోవా గురించి చాలామందికి తెలుసు. అయితే మొదటి భార్య నందిని రెడ్డి గురించి మాత్రం చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. ఈ క్రమంలోనే పవన్ మొదటి భార్య నందిని రెడ్డి బ్యాగ్రౌండ్‌కు సంబంధించిన వార్త వైరల్‌గా మారుతుంది. పవన్ మొదటి భార్య ఇండస్ట్రీలో ఓ స్టార్ దర్శకుడు మరదలు అంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఈ విషయాన్ని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఆ స్టార్ డైరెక్టర్ స్వయంగా వెల్లడించారు. ఇంతకి ఆయన ఎవరంటే.. సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ. రీసెంట్గా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ మొదటి భార్య నందిని.. నాకు బంధువే. ఆమెది పోలవరం అంటూ చెప్పుకొచ్చాడు.
మా అక్క పోలవరం అబ్బాయిని వివాహం చేసుకుంది. అలా పెళ్లి జరిగాక మాకు పోలవరానికి చెందిన నందిని కూడా పరిచయం అయింది. ఇక నందిని వాళ్లది చాలా పెద్ద కుటుంబం. ఆమెను చిన్నప్పుడు చూశా. అయితే నందిని పవన్, వివాహం చేసుకున్నారన్న సంగతి నాకు మొదటి తెలియదు. నాగార్జునతో కలిసి ఓ సినిమా షూటింగ్ కోసం గతంలో పోలవరం వెళ్ళా. వర్షం కారణంగా అప్పుడు నందిని ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అప్పటికే పవన్‌తో నందిని వివాహం కాలేదు. ఆ రోజు వాళ్ళ ఇంట్లో మేము కొద్దిగా సేపు ఉన్నాం. నందిని ని అందరూ చిన్ని.. చిన్ని.. అని ప్రేమగా పిలుచుకునే వాళ్ళు అంటూ చెప్పుకొచ్చింది. నందిని పెళ్లయ్యాక మళ్ళీ నేను పోలవరం వెళ్ళినప్పుడు ఆమె పెళ్లి ఆల్బమ్ వాళ్ళ నాన్న నాకు చూపించారని వివరించాడు.
అలా నందిని.. పవన్ కళ్యాణ్‌ను వివాహం చేసుకుందని నాకు తెలిసిందంటూ గీతకృష్ణ వివరించాడు. పవన్ మొదటి పెళ్లి అంత రహస్యంగా.. సింపుల్గా చేయడానికి కారణం పవన్ కళ్యాణ్ ఏనట.. ఆయనకు గ్రాండ్గా వివాహం చేసుకోవడం అసలు ఇష్టం లేదని.. తన ఇష్ట ప్రకారమే ఫ్యామిలీ మెంబర్స్ నందినితో వివాహం.. షిరిడి తీసుకువెళ్లి చాలా సింపుల్గా చేశారంటూ గీతకృష్ణ వివరించాడు. ఇక నందిని పవన్ వివాహం ఎన్ని రోజులు కొనసాగలేదు.. నందిని కి విడాకులు ఇచ్చేసి రేణు దేశాయ్‌ని ప్రేమించి ఇంట్లో సింపుల్ గా వివాహం చేసుకున్నాడు పవన్. తర్వాత రేణు దేశాయ్‌కు కూడా పవన్ విడాకులు ఇచ్చేసి.. అన్నా లేజ్నోవాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమెతో లైఫ్ లీడ్ చేస్తున్నాడు.