మెగా, అల్లు కుటుంబాల కోల్డ్ వార్ గురించి ఇప్పుడు కాదు.. గత కొన్ని నెలలుగా వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు ఈ వివాదాలకు సంబంధించిన ఏదో ఒక వార్త హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతూనే ఉంది. అలా.. తాజాగా అల్లు అర్జున్ తీసుకున్న ఓ షాకింగ్ డెసిషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎక్కడ చూసినా ఇదే న్యూస్ మారుమోగిపోతుంది. ప్రస్తుతం అల్లు అర్జున్.. టాలీవుడ్ ఐకాన్ స్టార్ గా వన్ ఆఫ్ ది బెస్ట్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. అల్లు అర్జున్ ఇటీవల కాలంలో రకరకాల నెగటివ్ వార్తలు వినిపిస్తున్నా.. క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గడం లేదు. ముఖ్యంగా.. మెగా ఫ్యామిలీ, అల్లు అర్జున్‌కు మధ్యన గడ్డి వేస్తే బగ్గు మానేంతలా.. ఆగ్రహపు జ్వాలలు రగులుతున్నాయి.
బన్నీ హెడ్ వెయిట్ ఈ వివాదాలకు ప్రధాన కారణం అని రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి క్రమంలో తాజాగా అల్లు అర్జున్ గద్దర్ అవార్డ్ సొంతం చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారి గద్దర్ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ గద్దర్ అవార్డ్స్‌లో అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడిగా అవార్డు వరించింది. దీని పట్ల ఎంతోమంది ప్రముఖులు.. బన్నీపై ప్రశంసల వర్షం కురిపించారు. పుష్ప 2 కోసం.. ఆయన పడ్డ కష్టం గురించి చెప్పుకొచ్చారు. అయితే.. మెగా ఫ్యామిలీ దీనిపై కనీసం రెస్పాండ్ కాకపోవడంతో.. మరోసారి అల్లు, మెగా ఫ్యామిలీలా గొడవలు ఏమాత్రం సర్దుమనుకోలేదని.. కంటిన్యూ అవుతున్నాయని జనాలు మధ్యన టాక్ మొదలైంది. ఇలాంటి నేపథ్యంలో.. తాజాగా అల్లు అర్జున్, స్నేహ రెడ్డి.. మెగా, అల్లు కుటుంబాలకు కలిపి ఉన్న ఓ వాట్సప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయినట్లు సమాచారం.
ఈ రెండు ఫ్యామిలీలలో ఏ చిన్న ఈవెంట్ ఉన్నా, ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉన్నా అందరూ ఈ గ్రూపులోనే ముచ్చటించుకుంటారని.. ముందుగానే కాల్ షీట్స్ ఫిల్ చేసుకోకుండా జాగ్రత్త పడేలా ప్లాన్ చేసుకుంటారని తెలుస్తోంది. దీని కోసమే ఆ స్పెషల్ వాట్సాప్ గ్రూప్ ని ఫ్యామిలీ క్రియేట్ చేసుకున్నారట. కాగా.. ఇప్పుడు మెగా కుటుంబం బన్నీ స్నేహలను దూరం పెట్టేస్తున్న నేపథ్యంలో.. ఇద్దరు గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయినట్లు టాక్ వైరల్‌గా మారుతుంది. అల్లు అర్జున్ ఇలా వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అవ్వడం.. మెగా ఫ్యామిలీతో రిలేషన్‌ను కట్ చేసుకున్నట్లే అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి క్రమంలోనే మళ్లీ బన్నీ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మధ్యన స్ట్రాంగ్ వార్ ప్రారంభమై ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటూ సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతున్నారు. కాగా.. బన్ని, స్నేహ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యామని వస్తున్న ఈ వార్తలపై ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.