టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ తెలుగు స్పీచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో ఎంత పెద్ద పెద్ద భారీ భారీ డైలాగులైన గుక్కతిప్పుకోకుండా గటగటా చెప్పేసే బాలయ్య.. స్పెషల్ ఈవెంట్లో వేదికపై మాట్లాడేటప్పుడు మాత్రం చిన్న పదాలను కూడా మాట్లాడలేక తడబడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ఆయన మాట్లాడే తెలుగు కొన్ని సందర్భాల్లో అర్థం చేసుకోవటానికి కూడా టైం పడుతుంది. ఇలాంటి క్రమంలోనే ఇటీవల ఆయన దేశభక్తి గేయం అయిన.. సారే జహాసే అచ్చా.. సాంగ్ కూడా సరిగ్గా పాడలేక విపరీతమైన ట్రోలింగ్స్ ఎదుర్కొన్నాడు. కాగా.. తాజాగా మరోసారి బాలయ్య చేసిన పని ఆయనపై విమర్శలకు కారణం అవుతుంది. ఇంతకీ బాలయ్య ఏం చేశాడు.. అసలు మ్యాటర్ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం.
తాజాగా.. తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డుల పురస్కారాలతో సినీ ఇండస్ట్రీని గౌరవించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాన వేడుకల్లో పాల్గొన్న బాలయ్య.. స్టేజ్‌పై మాట్లాడుతూ.. ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క పేరును మర్చిపోయాడు. దాన్ని కవర్ చేసేందుకు ఎంతగానో కష్టపడ్డాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌గా మారుతుంది. శనివారం సాయంత్రం హైటెక్స్ లో జరిగిన గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం వేడుకల్లో బాలయ్య సందడి చేశాడు. తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డును పురస్కరించింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఈ అవార్డును బాలయ్యకు అందజేశారు.
ఈ నేపదయంలో బాలయ్య వారికి ధన్యవాదాలు చెబుతూ స్పీచ్ ని మొదలుపెట్టాడు. ఈ క్రమంలో మల్లు బట్టి విక్రమార్క పేరు మర్చిపోయాడు. అర్ధిక, విద్యుత్ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి.. మల్లు.. అంటూ పూర్తి పేరును పలకడానికి తెగ ఇబ్బంది పడిపోయాడు. చాలాసేపు నీళ్ళు నమిలిన తర్వాత.. పక్కనే ఉన్న రేవంత్ రెడ్డి అందించడంతో బట్టి పేరును స్పష్టంగా పలికి ధన్యవాదాలు తెలియజేశాడు. ఇక.. ఈ వీడియో నెటింట వైరల్‌గా మారడంతో.. నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. పలువురు బాలయ్యను ట్రోల్స్ చేస్తున్నారు.