బాలయ్య అఖండ 2 ఓవర్సీస్ టార్గెట్.. బడ్జెట్ డీటెయిల్స్..!

టాలీవుడ్‌ నందమూరి నట‌సింహం బాలకృష్ణ.. ప్రస్తుతం నటిస్తున్న మూవీ అఖండ 2 తాండవం. బోయపాటి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. ఇక బాలయ్య, బోయపాటి కాంబోలో ఇప్పటివరకు తెర‌కెక్కిన ఈ మూడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి బ్లాక్ బ‌స్టర్‌గా నిలవడం.. అది కూడా అఖండలాంటి బాక్సాఫీస్ బ్లాక్ బాస్టర్‌కు సీక్వెల్ గా అఖండ 2 రూపొందుతున్న క్రమంలో.. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే.. తాజాగా అఖండ 2కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ చేసిన వైరల్ గా మారుతుంది.

ఇప్పటికే అఖండ 2 డిజిటల్ హక్కుల కోసం.. అమెజాన్ ప్రైమ్ తెగ ప్రయత్నాలు చేస్తుందట. ఇక ఈ సినిమాలో యాక్షన్స్ సన్నివేశాలు హైలెట్గా నిలవనున్నాయని టాక్. కాగా.. ఇలాంటి క్రమంలోనే ఓవర్సీస్‌లో అఖండ 2 టార్గెట్ అందరికీ షాక్‌ను కలిగిస్తుంది. ఏకంగా రెండు మిలియన్ డాలర్ల టార్గెట్‌తో ఈ సినిమాను అక్కడ రిలీజ్ చేయనున్నారు. అఖండ 2.. ఓవర్‌సిస్ కలెక్షన్ల విషయంలో సంచలనాన్ని సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ.. ఇద్దే నిజబై.. టార్గెట్ ను బ్రేక్ చేస్తే మాత్రం ఇక బాల‌య్య‌ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు ఉండవు.

ఇక ఓవరాల్గా అఖండ 2 సునయాసంగా రూ.100 కోట్ల మార్కులు బ్రేక్ చేసేస్తుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే.. సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్స్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇక రూ.70 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమా.. ఈ ఏడాది సెప్టెంబర్ 25న దసరా కానుకగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందో.. ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో.. వేచి చూడాలి.