గుజరాత్ అహ్మదాబాద్‌లో నిన్న జరిగిన విమాన ప్రమాదం భారతదేశానే కాదు.. ప్రపంచ దేశాలన్నీ విచారానికి గురి చేస్తున్నాయి. దేశాధినేతలకు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇంటి నుంచి ఆనందంగా వీడ్కోలు చెప్పి.. జర్నీ ప్రారంభించిన ఎంతోమంది.. క్షణాల వ్యవధిలో తిరిగిరాని లోకాలకు వెళ్లడం అందరి మదిని కలచి వేస్తుంది. ఇక ఈ ప్రమాదంలో 12th ఫెయిల్ మూవీ హీరో విక్రాంత్ ఇంట కూడా తీవ్ర విషాదం నెలకొంది. తన మావయ్య ఆయన క్లిఫర్డ్ కుందర్ కుమారుడు క్లైవ్ కుందర్ మరణించడంతో తన బాధను సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు విక్రాంత్. తన దగ్గర బంధువు మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ.. స్టోరీలో ఈ విషయాన్ని పంచుకున్నాడు.
ఈ ప్రమాద బాధిత కుటుంబాల అందరికీ తన సానుభూతిని తెలియజేసిన విక్రాంత్.. తనకు ఎంతో దగ్గర వ్యక్తి అయినా క్లైవ్ కుందర్ మరణించడం చాలా బాధాకరమైన చెప్పుకొచ్చాడు. ఈరోజు ఈ గుజరాత్ ఫ్లైట్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబాన్ని చూసి నా హృదయం ముక్కలైపోయింది.. ఈ ఘటనలో మా మామ క్లిఫర్డ్ కుందర్ కుమారుడు క్లైవ్ కుందర్‌ను కోల్పోయామని తెలియడం మరింత బాధాకరం. ఆయన ఈ విమానంలో పనిచేస్తున్న మొదటి అధికారి అంటూ చెప్పుకొచ్చాడు. ఆ పోస్ట్ ప్రస్తుతం నెటింట వైరల్ అవ్వడంతో.. అభిమానులు దీనిపై రకరకాలుగా స్పందిస్తూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణం ఇంధనం నిండుగా ఉండడం అని తెలుస్తుంది. ఎక్కువ దూరం వెళ్లాల్సిన క్రమంలో.. ఇంధనం పూర్తిగా నింపడం వల్లే ఈ ప్రమాద తీవ్రత మరింత పెరిగిందట. మధ్యాహ్నం 1గం 39 నిమిషాల సమయం లో చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఇక ప్రమాదానికి గురైన విమానం.. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం. 300 మంది వరకు ప్రయాణించవచ్చు. కాగా.. ఈ ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించారు. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని ఆ విమానంలో ప్రయాణిస్తున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. విమానం ఒక కాలేజ్ పై కూలడంతో అభం శుభం తెలియని విద్యార్థుల ప్రాణాలు పోయాయి. ఈ ఘటనలో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు.