టాలీవుడ్ లో కమర్షియల్ సినిమాలను తెరకెక్కించి మంచి సక్సెస్ సాధించే దర్శకులను వేళ్ళ పై లెక్క పెట్టవచ్చు. అలాంటి వారిలో కచ్చితంగా అనీల్ రావిపూడి పేరు మొదటి వరుసలో వినిపిస్తుంది. ఇక మొన్ననే ఆయన తెరకెక్కించిన ఎనిమిది సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచి సక్సెస్ఫుల్ స్టార్ డైరెక్టర్గా నిలబెట్టాయి. కాగా.. ఇప్పుడు అనిల్.. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసాడు. ఈ సినిమాతో తొమ్మిదవ బ్లాక్ బస్టర్ అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమాను ఎలాగైనా సరే హిట్‌గా నిలబెట్టాలని కసితో ముందుకు సాగుతున్నాడు.
కాగా.. ఇప్పటికే ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నయనతార ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌కు కూడా అవకాశం ఉన్న క్రమంలోనే.. మరో హీరోయిన్గా చిరు కోసం ఓ కత్తిలాంటి ఫిగర్ను అనిల్ రంగంలోకి దించాడంటూ టాక్ నడుస్తుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ఫిక్స్ అయ్యిందట. కారణం చివరిగా ఆమె నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో తన అద్భుతమైన నటన అని తెలుస్తుంది. ఈ సినిమాల్లో తన నటనతో సత్తా చాటుకున్న మీనాక్షి.. గ్లామర్‌తోను ఆడియన్స్‌ను కట్టిపడేసింది. ఈ క్రమంలోనే చిరంజీవికి జోడిగా సెకండ్ హీరోయిన్గా మీనాక్షి చౌదరి పర్ఫెక్ట్ అని భావిస్తున్నారట టీం.
ప్రస్తుతం మీనాక్షి చౌదరికి ఉన్న క్రేజ్ రీత్యా.. సెకండ్ హీరోయిన్గా నటించాల్సిన అవసరం లేనేలేదు. అయినప్పటికీ అనిల్ రావిపూడితో ఉన్న ఫ్రెండ్‌షిప్‌తో అనిల్‌కు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇక అనిల్ ఈ సినిమాలో తన మార్క్ స్టైల్‌తో చిరంజీవిని కొత్తగా ఎలివేట్ చేయనున్నాడని.. వింటేజ్ చిరును చూపించబోతున్నాడు అని ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకోవడం ఖాయం అంటూ టీం టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే షూట్ ప్రారంభించిన అనిల్.. ఈ సినిమాతో ప్రేక్షకుల్లో ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటాడో.. ఎలాంటి సక్సెస్ అందుకుంటాడు వేచి చూడాలి.