నందమూరి నటసింహం బాలకృష్ణ, అక్కినేని కింగ్ నాగార్జున ఇద్దరు టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్తో సీనియర్ స్టార్ హీరోలుగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. గతంలో ఎన్నోసార్లు ఒకే స్టేజ్‌ను షేర్ చేసుకున్న ఈ ఇద్దరు.. తర్వాత వివాదాలతో ఒకరికి ఒకరు దూరమయ్యారు. ఇప్పటికి వీరిద్దరి మధ్యన వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయట. ఇలాంటి క్రమంలోనే ఇద్దరూ కలిసి ఒకే ఈవెంట్లో మెరపడమే చాలా కష్టం.. అలాంటిది ఏకంగా వీళ్ళిద్రితో ఓ సినిమానే ప్లాన్ చేశాడు క్రేజీ డైరెక్టర్. అది కూడా హీరోలు కాదు.. ఒకరు విలన్ గా, ఒకరు హీరో ఫ్రెండ్ గా నటించనున్నారట. ఇది నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. వాస్తవమంటూ టాక్ వైరల్ గా మారుతుంది.
ఇద్దరు ఆ సినిమాకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసారని టాక్. ఒకప్పుడు టాలీవుడ్ లో మల్టీస్టారర్ ఆలోచన చేయడమే కష్టంగా ఉండేది. అలాంటిది ఇటీవల ఇండస్ట్రీలో మల్టీస్టారర్ ట్రెండ్ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే హీరోలతో పాటు.. దర్శకులు కూడా మల్టీ స్టారర్ సినిమాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అలా.. ఇప్పుడు తమిళ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కూడా.. ఓ సినిమాలో నాగార్జున, బాలకృష్ణని నటింపచేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే వాళ్ళిద్దర్నీ అప్రోచ్ కాగా.. బాలయ్య గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. నాగ్ తాజాగా ఓకే చేశాడని సమాచారం.
ఇక రజనీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి.. ఏకంగా రూ.650 కోట్ల కలెక్షన్లు కల్లగొట్టిన మొదటి సినిమాగా రికార్డులు క్రియేట్ చేసిన జైలర్ సినిమాకు సీక్వెల్ గా జైలర్ 2 సినిమాను నెల్సన్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. కదా ఈ సినిమా కోసమే స్పెషల్ గెస్ట్ గా బాలయ్యను సంప్రదించారని.. బాలయ్య దీనికి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. నిజానికి బాలయ్య జయర్ సినిమాలో నటించాల్సి ఉన్నా.. అది అప్పట్లో వర్కౌట్ కాలేదు. ఈ క్రమంలోనే జైలర్ 2కు బాలయ్య ఒకే చెప్పేశాడట. అలాగే ఈ సినిమాలో నాగార్జున విలన్‌గా నటించనున్నాడట. ఇక నాగ్ పాత్రను నెల్సన్ ఎంతో ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఇప్పటికే రజనీకాంత్ కూలి సినిమాలో నాగార్జున విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రజినీకాంత్‌తో మరో సినిమాలో నటించేందుకు ఓకే చెప్పారట. ఇక నాగ్, బాలయ్య మధ్యన అసలు సంబంధాలే లేని నేపథ్యంలో ఇద్దరు కలిసి ఒకే సినిమాలో కనిపించడం అంటే అది నిజంగానే ఫ్యాన్స్ కు ఒకింత ఆశ్చర్యకరమైన విషయమే. మరి నెల్సన్ ఇద్దరిని ఒకే సినిమాల్లో చూపిస్తున్న.. వాళ్ళిద్దరి మధ్యన ఏమన్నా సీన్స్ రాసాడో లేదో.. నిజంగానే జైలర్ 2లో వీళ్ళిద్దరూ కలిసి నటిస్తారో.. లేదో.. వేచి చూడాలి.