కోలీవుడ్ స్టార్ హీరో విశాల్.. త్వరలోనే పెళ్లి చేసుకుంటానంటూ.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పెళ్ళికి సంబంధించిన రకరకాల వార్తలను నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. విశాల్ వివాహం చేసుకోబోతున్న ఆ వధువు ఎవరోకాదు.. హీరోయిన్ సాయి ధన్సికా అంటూ.. ఆమెతోనే విశాల్ ఏడడుగులు వేయబోతున్నాడు అంటూ వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్న నేపథ్యంలో.. వీరి ప్రేమకు పెద్దలు కూడా అంగీకరించారంటూ టాక్ నడుస్తుంది.
అయితే.. దీనిపై విశాల్, ధన్సిక ఇద్దరు రియాక్ట్ కాలేదు. ఇప్పటివరకు విశాల్ పెళ్లి గురించి ఇతర వార్తలు ఎన్నో వచ్చాయి. గతంలో విశాల్‌ను వరలక్ష్మి వివాహం చేసుకోబోతుందంటూ.. హీరోయిన్ అభినయతో పెళ్లి జరగబోతుందంటూ రకరకాల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే.. విశాల్ గతంలోనే నడిగర్ సంఘం.. బిల్డింగ్ నిర్మాణం పూర్తయ్యేంతవరకు తాను వివాహం చేసుకోనని వెల్లడించారు. ఈ క్రమంలోనే.. తాజాగా నడిగర్ సంఘం బిల్డింగ్ నిర్మాణం పూర్తయింది. ఈ విషయంపై ఆయన మీడియాతో ముచ్చటించారు.
పెళ్లి గురించి ఇంటర్వ్యూవర్ ప్రశ్నించగా.. త్వరలోనే పెళ్లి చేసుకుంటా.. నా లైఫ్ పార్టనర్‌ను సెలెక్ట్ చేసేసుకున్న.. ఇప్పటికే పెళ్లి గురించి మా మధ్య చర్చలు మొదలయ్యాయి.. తప్పకుండా ప్రేమ వివాహం చేసుకుంటా.. త్వరలోనే మరిన్ని విషయాలు వెల్లడిస్తా అంటూ చెప్పుకొచ్చాడు. ఇలాంటి క్రమంలోనే.. విశాల్ ప్రేమించింది హీరోయిన్ ధన్సికానీ అంటూ.. త్వరలోనే ఆమెను వివాహం చేసుకోబోతున్నాడు అంటూ టాక్ నడుస్తుంది. ఇక గతంలో అనీషా అనే నటితో నిశ్చితార్థం చేసుకున్న విశాల్.. తర్వాత ఆ రిలేషన్‌ను బ్రేక్ చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల ఈ పెళ్లి ఆగిపోయింది.