సమంత పై ఫోకస్ చేస్తున్న త్రివిక్రమ్.. ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

స్టార్ హీరోయిన్ సమంత ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే. అనారోగ్య, వ్యక్తిగత సమస్యల కారణంగా గత కొంతకాలంగా టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు.. బాలీవుడ్‌లో మాత్రం పలు వెబ్ సిరీస్‌ల‌లో నటిస్తుంది. అయితే తాజాగా ప్రొడ్యూసర్గా మారి టాలీవుడ్ ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. శుభం ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ అమ్మడు.. ఈ సినిమాతో మంచి సక్సెస్లు అందుకుంది. కాగా సమంత టాలీవుడ్ లో సినిమాల కోసం ప్రయత్నించిన అవకాశాలు ఇచ్చేందుకు ఎవరు ముందుకు రావడం లేదంటూ గత కొంతకాలంగా పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఇలాంటి క్రమంలో సమంత లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి తన క్రేజ్ ను ఇండస్ట్రీలో అదే రేంజ్‌లో కొనసాగించే ప్రయత్నాలు చేస్తుంది. ఈ విషయంలో ఆమె నయనతారను ఆదర్శంగా తీసుకున్నట్లు పవర్ఫుల్ లేడి ఓరియంటెడ్‌ సినిమాలు చూజ్ చేసుకుని నటించాలని సెర్చింగ్ లో ఉన్నట్లు టాక్. ఇక ఇందులో భాగంగానే సమంత టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో కొందరు టాలెంటెడ్ రైటర్స్, డైరెక్టర్స్‌తో సంప్రదింపులు జరుపుతుందట. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం.

సమంతతో సన్ ఆఫ్ సత్యమూర్తి, అత్తారింటికి దారేది, అఆ సినిమాలను రూపొందించిన త్రివిక్రమ్.. ఆ సినిమాలన్నీ హిట్ అవడంతో ఆమెతో సినిమా తీయాలని ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. నిజానికి త్రివిక్రమ్.. అల్లు అర్జున్‌తో సినిమా చేయాలని ఎంతగానో ప్రయత్నించినా.. ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. ఈ క్రమంలోనే వెంకటేష్‌తో త్రివిక్రమ్ సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై అఫీషియల్ ప్రకటన రావలసి ఉంది. ఈ నేపథ్యంలోనే సమంత కోసం ఓ సపరేట్ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్.. స్ట్రాంగ్ గా డిజైన్ చేయడంలో బిజీ అయ్యాడట త్రివిక్రమ్.