ఈ పై ఫోటోలో కనిపిస్తున్న స్టార్ హీరోయిన్ను గుర్తుపట్టారా. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతున్నా ఇప్పటికి ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోయిన్ గా మారిన ఈ అమ్ముడు.. 35 సంవత్సరాల వయసులోను వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా గడిపేస్తుంది. ఇక తాజాగా లవ్, బ్రేకప్ అంటూ కొని రోజులపాటు నెటింట హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్గా దూసుకుపోయింది. సినిమాలో హీరోయిన్గా నటించకుండా స్పెషల్ సాంగ్స్‌లో ఆకట్టుకుంటుంది.
ఇక తెలుగులో.. హీరోయిన్గా నటించకున్నా.. తమిళ్లో రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకుంది. సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ఆమె నటించిన మూవీ కోలీవుడ్‌ను బ్లాస్ట్ చేసింది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరు.. ఇప్పటికైనా గుర్తుపట్టారా.. సర్లే నేను చెప్పేస్తా. ఆమె ఎవరో కాదు టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా. ఎస్.ఏ. డైరెక్షన్లో తెరకెక్కిన కేడి సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ అమ్మడు.. తర్వాత టాలీవుడ్‌లోను ఎంట్రీచి తన సత్తా చాటుకుంది. గ్లామర్ రోల్సే కాదు.. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోని తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది.
కాగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం నడిపిన ఈ అమ్మడు.. అతనితో డేటింగ్ లో ఉన్నట్టు అఫీషియల్ గానే ప్రకటించింది. కానీ.. ఇటీవల తమన్న.. విజయ్‌కు బ్రేకప్ చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటే తమన్న నటించిన సూపర్ హిట్ సినిమా జైలర్.. ఏకంగా రూ.650 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టగా.. అరుణ్మనై సినిమాతో తమన్న రూ.100 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. అయితే.. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోయిన ఈ అమ్మడు.. ప్రస్తుతం తెలుగు, తమిళ్లో అవకాశాలకు దూరమైంది. కేవలం హిందీ సినిమాల్లో మాత్రమే నటిస్తుంది.