టాలీవుడ్ యంగ్ బ్యూటి శ్రీలీల ఒకప్పుడు ఎలాంటి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుంది. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది. అయితే.. తను నటించిన ఒక్క సినిమా కూడా సరైన సక్సెస్ అందుకోకపోవడంతో మెల్లమెల్లగా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గుతు వచ్చాయి. ఇలాంటి క్రమంలోనే.. నార్త్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తుంది ఈ ముద్దుగుమ్మ తాజాగా బాలీవుడ్ ఎంట్రీ కి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. కార్తీక్ ఆర్యన్‌తో కలిసి అమ్ముడు ఓ సినిమాలో మెరవనుంది. అయితే.. కార్తిక్ ఆర్యన్‌తో కలిసి శ్రీలీల చట్టపట్టలేసుకుని తిరుగుతున్న నేపథ్యంలో.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు కూడా తెగ వైరల్ గా మారుతున్నాయి.
వీటికి ఊతం ఇచ్చేలా.. కార్తిక్ ఆర్యన్ ఫ్యామిలీతో కలిసి.. మరోసారి మెరిసింది ఈ యంగ్ బ్యూటీ. అంతేకాదు తాజాగా కార్తీక్ ఆర్యన్ తల్లి ఓ ఈవెంట్లో సందడి చేసింది. ఇందులో భాగంగా మీకు ఎలాంటి కోడలు రావాలని కోరుకుంటున్నారు అని ప్రశ్న ఎదురుగా.. మా ఇంటికి ఒక డాక్టర్ కోడలుగా వస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇక శ్రీలీల ఇప్పటికే ఎంబిబిఎస్ పూర్తి చేసి.. డాక్టర్ పట్టా పుచ్చుకోనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రీలీలను ఉద్దేశించి కార్తిక్ ఆర్యన్ తల్లి ఇలాంటి కామెంట్స్ చేసిందంటూ అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇక ఈ క్రమంలోనే వీరిద్దరి ప్రేమాయణం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. అయితే తాజాగా శ్రీ లీల గురించి మరో షాకింగ్ న్యూ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
ఈ అమ్మడు సీక్రెట్ ఎంగేజ్మెంట్ చేసుకుందని టాక్ వైరల్ గా మారుతుంది. అసలు మేటర్ ఏంటంటే.. తాజాగా శ్రీ లీల లంగా వోని వేసుకొని.. నగలు, కుంకుమతో ట్రెడిషనల్ లుక్ లో అచ్చతెలుగు ఆడపిల్లల ఆకట్టుకుంది. మరో అమ్మాయిని హగ్ చేసుకుని థిస్ ఇస్ బిగ్ డే అంటూ క్యాప్షన్ తో తాజాగా ఓ పిక్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఇక.. ఈ ఫోటో తెగ వైరల్‌గా మారడం.. శ్రీలీల కూడా.. ట్రెడిషనల్ లుక్‌లో పెళ్లి పిల్లలా ముస్తాబడడంతో చాలామంది నెటిజన్లు.. శ్రీ లీల రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకుందా ఏంటి..? బిగ్ డే అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్ వెనుక అసలు అర్థం ఏమై ఉంటుంది అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. అయితే అమ్మడి ఫ్యాన్స్ మాత్రం తను ఇంకా ఎంగేజ్మెంట్ చేసుకోలేదని.. ఎవరి పెళ్లిలోను సందడి చేసి ఉంటుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.