స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడమోరుతో డేటింగ్ చేస్తుందంటూ గత కొంతకాలంగా వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే ఎక్కడికి వెళ్లిన వీరిద్దరూ కలిసి కనిపించడం.. చట్టపట్టలేసుకుని తిరగడం.. సమంత ఇంట్లో కూడా ఇద్దరు కలిసి ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ వార్తలకు మారింత ఆద్యం పోసినట్లు అయింది. అయితే.. ఈ రేంజ్ లో సమంత, రాజ్ రిలేషన్ గురించి వార్తలు వైరల్ అవుతున్న సమంత మాత్రం వారిద్దరి మధ్యన ఉన్న రిలేషన్ పై క్లారిటీ ఇవ్వడం లేదు.
ఈ క్రమంలోనే వీళ్ళిద్దరు త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఇలాంటి నేపథ్యంలో తాజాగా సమంత మేనేజర్ ఈ వార్తలపై రియాక్ట్ అయ్యారు. సమంత – రాజ్ పై వస్తున్న వార్తలు అన్నీ కేవలం రూమర్స్ అని.. వాళ్ళిద్దరూ క్రియేటివ్ ఫీల్డ్ లో కలిసి పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరు ఒకరితో ఒకరు క్లోజ్ గా ఉండడం కామన్.. రూమర్స్ ని అసలు నమ్మొద్దు అంటూ క్లారిటీ ఇచ్చాడు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే అంటూ వివరించాడు.
ఇక హీరోయిన్గా సక్సెస్ సాధించిన సమంత.. ఇటీవల శుభం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. దీనికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. దీంతో సినిమా సక్సెస్ పై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సమంత.. రాజ్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది. మా మొదటి అడుగును ప్రేమతో స్వాగతించినందుకు ధన్యవాదాలు అని క్యాప్షన్ పెట్టింది. అయితే ఇది శుభం సినిమా గురించి అని అర్థం కాక.. మిస్ అండర్‌స్టాండింగ్ వల్ల ఈ రూమర్స్ క్రియేట్ అయ్యాయి. రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ది ఫ్యామిలీ మెన్ 2, సిటాడెల్, హనీ బన్నీ.. సిరీస్ లలో సమంత, రాజ్‌తో కలిసి పని చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.