ఒకప్పుడు రోజుకు రూ.20 కూలి.. ఇప్పుడు కోట్లలో రెమ్యునరేషన్.. ఈ క్రేజి హీరోని గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా రాణిస్తున్న వారందరి లైఫ్‌ పూలపాన్పని అంతా భావిస్తూ ఉంటారు. అయితే అలా సక్సెస్ అందుకున్న స్టార్ హీరోలలో చాలామంది కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు, ఊడదుడుకులు ఎదుర్కొని ఈ స్టేజ్‌కు ఎదిగినవారే. అలాంటి వారిలో.. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న నటుడు కూడా ఒక్కడు. 1988లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన.. మొదట్లో చిన్న చిన్న సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లలో నటించాడు. ఇక 2004 తర్వాత ఈ హీరో లైఫ్ ఫుల్ చేంజ్ అయిపోయింది. కమెడియన్గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. స్టార్ హీరోల అందరి సినిమాల్లోనూ నటించిన మెప్పించాడు. 2022 వరకు కూడా కమెడియన్‌గా ఫుల్ క్రేజ్‌తో బిజీబిజీగా రాణించిన ఈయనను.. అందరూ కమెడియన్ చూస్తుంటే ఒక్క డైరెక్టర్ మాత్రం మంచి నటుడిని చూశాడు.

Soori interview on 'Garudan': I stopped getting comedy roles after 'Viduthalai' - The Hindu

ఈ క్ర‌మంలోనే అతనికి హీరోగా ఛాన్స్ ఇచ్చి ఓ సినిమాను రూపొందించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో హీరోగా మరిన్ని అవకాశాలను దక్కించుకుంటున్నాడు. ఇక నిన్న మొన్నటి వరకు కమెడియన్ గా చూసిన వాళ్లంతా.. ప్రస్తుతం హీరోగా ఆయన నటన చూసి ఆశ్చర్య పోతున్నారు. వామ్మో ఈ నటుడిలో ఇంత టాలెంట్ ఉందా అని.. హీరోగా అదరగొట్టేస్తున్నాడు అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే డిమాండ్ పెరగడంతో రెమ్యూనరేషన్ కూడా భారీ లెవెల్లో పెంచేశాడు ఈ స్టార్ నటుడు. ఇంతకీ ఎవరో చెప్ప‌లేదు కదా.. సూరి. పేరు చెప్తే ట‌క్కున గుర్తుకు రాకపోవచ్చు.. కానీ ఫోటో చూస్తే మాత్రం వెంటనే గుర్తుపట్టేస్తారు. ఈయనకు టాలీవుడ్ ఆడియన్స్ లోనూ ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక విజయ్‌ విడుదల పార్ట్ 1 సినిమాలో అద్భుతమైన న‌ట‌న‌తో ఆకట్టుకున సూరీ.. తర్వాత విడుదల పార్ట్ 2, గరుడాన్, పొట్టక్కలి, బడవ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకుని రాణించాడు.

Soori on 'Viduthalai', the story behind its making, and his takeaway from a 25-year journey - The Hindu

ఇప్పుడు మామాన్‌ సినిమాతో ఆడియన్స్ పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేసిన సూరి.. ఈ ఈవెంట్లో తన పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో పడిన కష్టాలను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యాడు. తిరుపూర్‌లో నేను రోజు కూలిగా రూ.20 జీతానికి పని చేసే వాడినని.. వారమంతా కష్టపడితే 140 రూపాయలు రావడం గగనంగా ఉండేదని.. అందులో సగం నా ఖర్చులకు ఉంచుకొని మిగతా డబ్బు ఇంటికి పంపించేసే వాడినని..ఆ సమయంలోనే నా లైఫ్ లో జీవిత పాటలు నేర్చుకున్నానా అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఎన్నో కష్టాలను చూసిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నానంటూ సూరీ చేసిన కామెంట్స్‌ప్రస్తుతం ప్ర‌స్తుతం వైరల్ గా మారడంతో.. సూరీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంత కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు తగిన ఫలితం దక్కిందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.