టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నవరసాలను అలవోకుగా పండించగల ఏకైక హీరో. ఒక్కటేకులోనే ఎంత పెద్ద డైలాగైనా చెప్పేయడం.. ఎన్టీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అనడంలో అతిశయోక్తి లేదు. ఇక డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా.. ఎంత కష్టతరమైన స్టెప్స్ అయినా సింగిల్ టేక్ లో వేసి తన సత్తా చాటుకోగలడు తారక్. ఇప్పటికే ఈ విషయాలను తనతో పని చేసిన ఎంతోమంది దర్శకులు ఓపెన్ గానే వెల్లడించారు. ఎలాంటి గ్రేస్ మూమెంట్స్ అయినా సులువుగా చేసేయగల ఎన్టీఆర్.. కేవలం నటన, డ్యాన్సులతో మాత్రమే కాదు.. తనలో మరో స్పెషల్ టాలెంట్ తోను ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. మల్టీ టాలెంటెడ్ హీరోగా రాణిస్తున్నాడు. ఇంతకీ అతనిలో ఉన్న మరో టాలెంట్ ఏంటంటే.. సింగింగ్. ఇక నేడే.. (మే 20) పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ పాడిన ఆ సాంగ్స్ లిస్ట్, డీటెయిల్స్ ఒకసారి చూద్దాం.
ఎన్టీఆర్ తన కెరీర్‌లో ఇప్పటివరకు పాడిన ప్రతి పాట సంచలనగా మారింది. హీరోలు పాటలు పాడడం కామన్. కానీ.. తారక్ బేస్ వాయిస్‌తో వచ్చే సాంగ్స్ మాత్రం వేరే లెవెల్‌లో ఉంటాయి. ఈ క్రమంలోనే.. ఆయన పాడిన ప్రతి సాంగ్ మంచి రిజల్ట్‌ను అందుకుంటుంది. ఇక రాజమౌళి డైరెక్షన్‌లో ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగ మూవీ బాక్స్ ఆఫీస్‌ను ఏ రేంజ్‌లో షేక్ చేసిందో తెలిసిందే. ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించిన ఈ సినిమాలో.. ‘ ఓలమ్మి తిక్క రేగిందా ‘.. సాంగ్ జూనియర్ ఎన్టీఆర్ ప్లే బ్యాక్ సింగర్ గా ఆలపించాడు. ఇక ఈ సాంగ్ ఇన్స్టంట్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. మణిశర్మ మ్యూజిక్ డైరెక్షన్‌లో వచ్చిన కంత్రి సినిమాలోను.. ‘ 1..2..3.. నేను ఒక కంత్రి ‘ సాంగ్ ఎన్టీఆర్ పాడారు. ఇక ఇప్పటివరకు ఎన్టీఆర్ లో ఉన్న సింగర్ని డిఎస్పి వాడిన రేంజ్ లో ఎవరు వాడలేదనే చెప్పాలి.
డిఎస్పి ఇప్పటివరకు ఎన్టీఆర్ తో ఏకంగా మూడు పాటలను పాటించాడు. 2010లో అదుర్స్ సినిమాలో ‘ చారి ‘ సాంగ్, 2011లో ఊసరవెల్లి.. ‘ ‘శ్రీ ఆంజనేయం ‘ సాంగ్.. 2016లో నాన్నకు ప్రేమతో మూవీలో ‘ ఫాలో ఫాలో ‘ సాంగ్.. ఈ మూడు సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. క్యాచీ ట్యూన్, ట్రెండీ వర్డ్స్ తో ఆడియన్స్‌ను మెప్పించాడు. కాగా.. నాన్నకు ప్రేమతో ఫాలో ఫాలో పాటకు గాను ఎన్టీఆర్ బెస్ట్ మేల్.. ప్లే బ్యాక్ సింగర్ గా ఫిలింఫేర్ అవార్డ్స్ కి సైతం నామినేట్ అయ్యారు. ఇక ఎన్టీఆర్.. ఎస్. ఎస్. థమన్ తోను పని చేసి.. తన పాటలతో మెప్పించాడు. 2014లో రూపొందిన రభస సినిమాలో ‘ రాకాసి రాకాసి ‘ పాట.. ఎంత పెద్ద హిట్గా నిలిచిందో తెలిసిందే. ఈ సాంగ్ ని కూడా తారక్ ఆలకించారు. ఇక తారక్ కేవలం తన సినిమాలకే కాదు.. ఇతర హీరోల సినిమాల్లోనూ పలు పాటలను ఆలపించారు. అలా 2016లో కన్నడ మూవీ చక్రవ్యూహకు థమన్ మ్యూజిక్ డైరెక్షన్‌లో ‘ గెలియె గెలియె ‘ సాంగ్ తారక్ పాడాడు.