టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ఫ్రాంచైజ్ 1,2 సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి సంచలనం సృష్టించాయో.. బాక్స్ ఆఫీస్ ను ఏ రేంజ్‌లో బ్లాస్ట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు భాగాలు కలిపి రూ.2000 కోట్లకు పైగా గ్రాస్‌వసూళను కొల్లగొట్టి పాన్ ఇండియా లెవెల్లో చరిత్ర సృష్టించాయి. భారతీయ సినీ ఇండస్ట్రీలోనే పుష్ప సినిమాకు ఓ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాతో బన్నీ, సుకుమార్ ఇద్దరు పాన్ ఇండియా లెవెల్‌లో భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే సినిమా రెండో భాగంలో పుష్ప 3కి సంబంధించిన లీడ్‌ను టీం రివీల్ చేసిన సంగతి తెలిసిందే.
కానీ.. సుక్కు ఇంకా స్క్రిప్ట్ మాత్రం సిద్ధం చేయలేదు. పుష్ప పార్ట్ 3 కోసం కావాల్సిన లీడ్ మాత్రమే అందించారు తప్ప.. సినిమా ఎలా ప్రారంభించాలి ఎలా యండ్ చేయాలనే క్లారిటీ కూడా సుకుమార్‌కు లేదట. ఈ విషయాన్ని బన్నీ, సుకుమార్ స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పుష్ప 3 ఇప్పట్లో ఉండదని అంత స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయారు. దాదాపు మూడు నుంచి నాలుగు ఏళ్ల వరకు బన్నీ, సుక్కు ఎవరి బిజీలైన వాళ్లు సెట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే సినిమా ఇప్పట్లో ఉండదని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పుష్ప 3 స్క్రిప్ట్ పనుల్లో సుక్కు బిజీ అయ్యాడట.
ఇప్పటినుంచి స్క్రిప్ట్ మొదలుపెడితే కానీ.. మరో రెండేళ్లకు ఈ స్క్రిప్ట్ పూర్తి కాదని కేవలం సినిమాకు ఆవించిన సుకుమార్.. ఈ స్క్రిప్ట్ వీలైనంత త్వరగా పూర్తి చేసి సెట్స్ పైకి తీసుకువెళ్లి.. సర్వే గంగా షూట్‌ను ముగించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పుష్ప 3ని ఓవరాల్‌గా నాలుగు సంవత్సరాలలో ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట. ఇక ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవడంతో బన్నీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇప్పట్లో ఉండదని ఫిక్స్ అయినా సినిమా స్క్రిప్ట్ పనులు అప్పుడే ప్రారంభమయ్యాయని టాక్ వైరల్ అవ్వడంతో ఇక పార్ట్ 3తో పూనకాలు పక్కా, బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.