తారక్ పై ఒక్కసారిగా ఎగబడిన ఫ్యాన్స్.. సహనం కోల్పోయి ఏం చేశాడంటే..?

లండన్ రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో నిర్వహించిన ఆర్‌ఆర్ఆర్ లైవ్ కాన్సర్ట్‌ గ్రాండ్ లెవెల్‌లో జరిగింది. రాజమౌళి, కీరవాణి, తారక్‌, చ‌రణ్‌ ఒకే వేదికపై కనిపించడంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. స్టేజ్‌పై తారక్‌ను చరణ్ ఆత్మీయంగా హత్తుకోవడం షోకే హైలెట్. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరు ఒకే వేదికపై కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక ఆర్‌ఆర్‌ఆర్ త‌ర్వాత పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ ద‌క్కించుకున్న చ‌ర‌ణ్‌, తార‌క్ ఎక్క‌డ క‌నిపించిన ఫ్యాన్స్ వీళ‌తో ఫోటోల కోసం ఎగ‌బ‌డిపోతున్నారు.

Did Jr NTR Lose His Calm At Fans During RRR Event In London? Here's The Truth Behind Viral Video - Filmibeat

కాగా.. ఈ క్ర‌మంలోనే.. లైవ్ కాన్స‌ర్ట్ ఈవెంట్ ముగిసిన తర్వాత.. తారక్ బయటకు వస్తున్న నేపథ్యంలో సెల్ఫీల కోసం జనం ఎగబడ్డారు. ఎన్టీఆర్.. వాళ్లను శాంతంగా వెయిట్ చేయండి.. కచ్చితంగా సెల్ఫీలు ఇస్తానని చెప్పిన.. వాళ్ళు వినిపించుకోకుండా మీదకు పడిపోవడంతో.. అసహనాన్ని వ్యక్తం చేశాడు. దీంతో చివరకు సెక్యూరిటీ సిబ్బంది ఎన్టీఆర్‌ను అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయారు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది.

Video of Jr NTR losing his cool at fans during 'RRR' event at the Royal Albert Hall goes viral | Hindi Movie News - The Times of India

ఇక తారక్ ఫాన్స్ ను నిరాశపరచలేదని.. వారిని కలవాలని కోరికతోనే బహిరంగంగా రియాక్ట్ అయ్యారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ.. అభిమానులు అతి ఆశక్తి.. అత్యుత్సాహం.. కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీలకు అసౌకర్యంగా మారుతుందని.. ఈ ఘటన చూస్తే క్లారిటీ వస్తుంది. అభిమానంతో బాధ్యత కూడా కలిగి ఉంటే.. అదే నిజమైన అభిమానం అవుతుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.