సినీ ఇండస్ట్రీలో నటీనటుల స్టార్‌డం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు గెస్ చేయలేరు. ఎవరి లైఫ్ స్పాన్ ఎంతో అస్సలు చెప్పలేరు. ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లు రాణిస్తున్న వారిలో హీరోయిన్ల లైఫ్ టైం మాత్రం హీరోల కంటే తక్కువగా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కారణం హీరోయిన్ కొంతకాలం సినిమాలో నటించిన తర్వాత.. ఏజ్ రిత్యా వైవాహిక జీవితంలోకి అడుగు పెడతారు. ఇక పెళ్లి చేసుకుని పిల్లలు కన్న హీరోయిన్స్ ఆంటీలుగా మారిపోతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్స్ గా రాణించిన ముద్దుగుమ్మలంతా.. తర్వాత ఆంటీలుగా సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తారు.
అలా ఇండస్ట్రీలో ఇప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించి రాణిస్తున్న ముద్దుగుమ్మలు చాలామంది ఉన్నారు. కాగా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టార్ బ్యూటీ కూడా అదే కోవకు చెందుతుంది. గతంలో ప్రభాస్ కు జంటగా నటిస్తూ ప్రభాస్ తో రొమాన్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ప్రభాస్ అక్కగా నటించేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరు.. అసలు మేటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. తను మరెవరో కాదు అన్షు . ఈమె గురించి టాలీవుడ్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మన్మధుడు సినిమాతో నాగార్జున పక్కన ఎంతో క్యూట్ గా నటించి మెప్పించిన ఈ అమ్మడు.. రాఘవేంద్ర సినిమాలో ప్రభాస్ లవర్ పాత్రలోను మెరిసిన సంగతి తెలిసిందే.
తర్వాత ఇండస్ట్రీకి దూరమైపోయిన ఈమె.. తన సెకండ్ ఇన్నింగ్స్‌ను తాజాగా ప్రారంభించి మజాకా సినిమాతో రి ఏంట్రి ఇచ్చింది. ఈ సినిమాలో తన అదిరిపోయే పర్ఫామెన్స్‌తో కుర్రాళ్ళ హార్ట్ కొల్లగొట్టింది. కాగా.. ఇప్పుడు ఇదే బ్యూటీ ప్రభాస్ కు అక్కగా నటించనుందట. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా నటించిన స్పిరిట్ మూవీ పై ఆడియన్స్ లో పీక్స్ లెవెల్ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా దీపిక పదుకొనే నటిస్తుందని టాక్. ఇదే మూమెంట్లో.. సినిమాలో సిస్టర్ క్యారెక్టర్ కోసం అన్షు సెలెక్ట్ అయ్యిందని.. అగ్రిమెంట్ పై కూడా సైన్ చేసేసింది అంటూ న్యూస్ వైరల్‌గా మారుతుంది.